రేర్ రికార్డ్.. హాలీవుడ్ లో రీమేక్ అవుతోన్న మహారాజ

ABN , Publish Date - Sep 16 , 2026 | 02:58 PM

కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా, నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో వచ్చి సంచలన సృష్టించిన సినిమా మహారాజ. 2024 లో రిలీజ్ అయిన ఈ చిత్రం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది.

Maharaja

కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా, నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో వచ్చి సంచలన సృష్టించిన సినిమా మహారాజ. 2024 లో రిలీజ్ అయిన ఈ చిత్రం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా చైనా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 91 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడమే కాకుండా ఓటీటీలో అంతర్జాతీయ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాను హాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ బిగ్ ప్రొడక్షన్ స్టూడియో రీమేక్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థలైన ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ అధికారికంగా ప్రకటించాయి.


ఇక హాలీవుడ్‌లో ఒక బడా స్టూడియో ద్వారా రీమేక్ కాబోతున్న తొలి తమిళ చిత్రంగా మహారాజ రికార్డులకెక్కింది. స్క్రీన్‌ప్లేలో ఉన్న ట్విస్టులు, ఎమోషనల్ అండ్ నాన్‌-లీనియర్ కథనం గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించడమే దీనికి ప్రధాన కారణం. కూతురికి జరిగిన అన్యాయానికి ఒక తండ్రి ఎలా పగతీర్చుకున్నాడు అనేది ఎంతో హృద్యంగా చూపించాడు డైరెక్టర్. ఇక విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది మహారాజ.


ఇక ఈ హాలీవుడ్ రీమేక్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీత, ఇంటర్‌స్టెల్లార్ ఫేమ్ మాథ్యూ మెక్‌కానాగే ప్రధాన పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇండియన్ సినిమా స్టోరీ టెల్లింగ్‌కు లభించిన ఈ అరుదైన గౌరవంపై సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 16 , 2026 | 03:05 PM