ఓటీటీకి వచ్చేస్తోన్న విజయ్ సేతుపతి బత్తా.. ఎక్కడ చూడొచ్చు అంటే
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:24 PM
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. తాజాగా ఆయన నటించిన యాక్షన్ డ్రామా చిత్రం 'బత్తా' (Baththa).
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. తాజాగా ఆయన నటించిన యాక్షన్ డ్రామా చిత్రం 'బత్తా' (Baththa). స్టార్ డైరెక్టర్ అట్లీ సమర్పణలో బాలాజీ తరణీతరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో మలయాళ నటి లిజోమోల్ జోస్, ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎన్నో అంచనాల నడుమ అక్టోబరు 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి ప్రేక్షక ప్రశంసలు అందుకుంది. చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
చాలామంది తమిళ్ లో చూసినవారు తెలుగులో ఎందుకు రిలీజ్ చేయలేదని కూడా నిలదీశారు. ఇక ఎట్టకేలకు బత్తా తెలుగులో కూడా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం అక్టోబరు 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా అందుబాటులోకి రానుండటం విశేషం. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
కథ విషయనికొస్తే 1986లో మద్రాసులో బత్తా అనే ఒక పేరుమోసిన గ్యాంగ్ స్టర్ ని పిరికివాడైన ఎనిమిదేళ్ల బాలుడు శబరి అనుకోకుండా తన స్కూల్ బాత్ రూమ్ లో పెట్టి తాళం వేస్తాడు. ఆ తరువాత బత్తా బాత్ రూమ్ లోపల ఎలా ఉన్నాడు.. ? తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు.. ? చిన్న పిల్లాడు, గ్యాంగ్ స్టర్ మధ్య జరిగిన సంఘటనల సమూహారమే ఈ సినిమా. ఏంటి గ్రిప్పింగ్ గా ఉండే ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.