Vijay Antony: నాన్న కుట్టి వచ్చేస్తోంది!
ABN , Publish Date - Sep 23 , 2026 | 06:21 PM
విజయ్ ఆంటోని తాజా చిత్రం 'నాన్న కుట్టి' విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్ 16న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
సంగీత దర్శకుడి నుంచి నటుడిగా టర్న్ అయిన వ్యక్తి విజయ్ ఆంటోని (Vijay Antony). తొలి చిత్రం నుంచి భిన్నమైన కథాంశాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాదు... తన చిత్రాల ద్వారా ఏదో స్థాయిలో చక్కని సందేశాన్ని ఇవ్వడానికీ ప్రయత్నిస్తున్నారు. మహిళల పునర్ వివాహం నేపథ్యంలో విజయ్ ఆంటోని నిర్మించిన 'వంద దేవుళ్ళు' (Vanda Devullu) సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఆయన మరో డిఫరెంట్ కథను ఎంచుకున్నారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’ (Nanna Kutti). యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

'నాన్న కుట్టి' సినిమా చిత్రీకరణ పూర్తయ్యి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాను అక్టోబర్ 16న విడుదల చేయబోతున్నట్టు తాజాగా మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేయగా, కథానాయకుడు విజయ్ ఆంటోనీ దీనికి సంగీతం అందించడంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలూ నిర్వర్తిస్తున్నారు. ఎ. రాజా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, భావోద్వేగ కథనం, హృద్యమైన సంగీతం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ‘నాన్న కుట్టి’ చిత్రం రానుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన, భావోద్వేగభరితమైన, మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందిస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది.
ఇది కూడా చదవండి:
రూ.100 కోట్ల క్లబ్‌లో ‘మండాడి’
టాలీవుడ్‌లో కొత్త పవర్‌ఫుల్ కాంబో? ‘ఓజీ’ డైరెక్టర్‌తో.. రామ్ చరణ్ సినిమా?
Chiranjeevi: నన్నెవరూ అడగరు.. కానీ నేనే క్రమశిక్షణ తప్పితే ఎలా?