సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కూతురు మరణం.. సంచలన నిర్ణయం తీసుకున్న విజయ్ ఆంటోనీ

ABN, Publish Date - Jun 07 , 2026 | 04:56 PM

సంగీత దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ (Vijay Antony) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Vijay Antony

సంగీత దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ (Vijay Antony) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగు హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారిన విజయ్ నటిస్తోన్న చిత్రం వంద దేవుళ్ళు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల సంగతి పక్కన పెడితే విజయ్ ఆంటోనీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


త్వరలోనే విజయ్ ఆంటోనీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్నాడట. సినిమాలు వదిలేసి.. విలేజ్ లో కుటుంబంతో సెటిల్ అవ్వాలని చూస్తున్నాడట. విజయ్ ఆంటోనీ లైఫ్ లో జరిగిన విషాద సంఘటన అందరికీ తెల్సిందే. ఆయన కుమార్తె లారా డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఆ తరువాత నుంచి విజయ్ ఆంటోనీ ఆమె జ్ఞాపకాలతో నలిగిపోతున్నాడు. సినిమాలు చేస్తున్నా కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతున్నాడు. అందుకే మనసుకు ప్రశాంతత కలిగించే పనులు చేయడానికి సిద్దమయ్యాడని తెలుస్తోంది. పల్లెటూరులో కొన్ని పొలాలు, భూములు కొనే ప్రయత్నంలో ఉన్నాడట విజయ్.


ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ అన్ని పూర్తిచేసి.. కుటుంబంతో సహా పల్లెటూరు వెళ్లిపోవడానికి ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాకుండా వంద దేవుళ్ళు సినిమాలో ఆయన ఒక రైతుగా కనిపించాడు. ఈ షూటింగ్ అంతా పల్లెటూరిలో జరిగింది. అక్కడి ప్రశాంతమైన వాతావరణం ఆయనకు బాగా నచ్చడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Jun 07 , 2026 | 05:17 PM