సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎంత మోసం చేశార్రా.. కాంత బ్యాక్ షాట్స్ అన్ని డూపా

ABN, Publish Date - Oct 18 , 2026 | 05:31 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జైలర్ 2 (Jailer 2) ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ అయినా కూడా భారీ వసూళ్లను రాబట్టి రికార్డ్ కలక్షన్స్ రాబడుతుంది.

Vidya Balan

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జైలర్ 2 (Jailer 2) ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ అయినా కూడా భారీ వసూళ్లను రాబట్టి రికార్డ్ కలక్షన్స్ రాబడుతుంది. సినిమాలో కంటెంట్ ఉండాలి అని ప్రేక్షకులు చెప్పినా.. ఈ సినిమా ఇచ్చిన హైప్ కి కంటెంట్ ని కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. ముఖ్యంగా సెకండాఫ్ లో విద్యా బాలన్ (Vidya Balan) ఎంట్రీ.. కాంత పాత్రలో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిధా అయ్యారు. చాలా సింపుల్ గా బాబీ హెయిర్ కట్ తో ఆమె నడుచుకుంటూ స్టైల్ గా సిగరెట్ తాగుతుంటే అక్కడ రజనీనే కాదు ప్రేక్షకులు కూడా అబ్బా సూపర్ ఫిగర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఇక సినిమాలో కాంత బ్యాక్ షాట్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పొచ్చు. ఆమె ఎంట్రీలో ఆ బ్యాక్ షాట్స్, వెనుక మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ హైప్ ని తీసుకొచ్చాయి. ఈ వయస్సులో కూడా విద్యా బాలన్ ఫిట్ నెస్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. అయితే ఈ సినిమాలో ఆమె సన్నివేశాల్లో వెనుక నుంచి చూపించే బ్యాక్ షాట్స్ డూప్‌తో తీశారని తెలియడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల్లో లేదా యాక్షన్, ఎలివేషన్ సీన్స్ చిత్రీకరించే సమయంలో సమయం ఆదా చేసేందుకు లేదా టెక్నికల్ కారణాల వల్ల కొన్ని లాంగ్, బ్యాక్ యాంగిల్ షాట్స్‌లో బాడీ డూప్‌లను ఉపయోగించడం చిత్ర పరిశ్రమలో చాలా సహజం. కానీ, ఇలా చిన్న చిన్న వాటికి కూడా డూప్ ని వాడడం దారుణమని చెప్పుకొస్తున్నారు.


తాజాగా కాంత డూప్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఎంత మోసం చేశార్రా.. నిజంగానే విద్యా బాలన్ అనుకున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే షూటింగ్ సమయంలో కష్టమైన డైలాగ్స్, సిగరెట్ సీక్వెన్స్‌లలో విద్యా బాలన్ స్వయంగా పాల్గొని పర్ఫెక్ట్ షాట్స్ ఇచ్చినట్లు దర్శకుడు నెల్సన్ కూడా ప్రమోషన్లలో వెల్లడించాడు. క్లోజప్స్, ఇంటెన్స్ ఎమోషనల్ అండ్ మాస్ డైలాగ్ సీన్స్‌లో విద్యా బాలన్ తన సొంత నటనతో సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. కేవలం కొన్ని బ్యాక్ షాట్స్ కి డూప్ వాడినంత మాత్రమ ఆ పాత్రకి కానీ, విద్యా బాలన్ కి కానీ నష్టమేమీ లేదని కొందరు చెప్పుకొస్తున్నారు.

Updated Date - Oct 18 , 2026 | 05:51 PM