సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అరసన్ ఫైర్ గ్లింప్స్.. కొడవలితో శత్రువులపై విరుచుకుపడిన శింబు!

ABN, Publish Date - Nov 11 , 2026 | 09:26 AM

వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు నటిస్తున్న అరసన్ సినిమా నుంచి ఫైర్ గ్లింప్స్ విడుదలైంది. అనిరుధ్ సంగీతం, శింబు మాస్ యాక్షన్ వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Arasan

తమిళ సినీ పరిశ్రమలో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్ (Vetrimaaran), స్టార్ హీరో శింబు (Silambarasan TR) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అరసన్’ (Arasan). ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వెట్రిమారన్ మార్క్ రా అండ్ రస్టిక్ మేకింగ్‌లో శింబును చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా మరో అదిరిపోయే అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా నుంచి కొత్తగా ‘ఫైర్ గ్లింప్స్’ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో శింబు మాస్ అవతార్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ఫైర్.. ఫైర్.. ఫైర్.. దాస్ అన్నన్ వందాలే ఫైర్’ అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుండగా.. చేతిలో కొడవలి పట్టుకుని శత్రువులపై శింబు విరుచుకుపడే సన్నివేశాలు గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించిన ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

ముఖ్యంగా ఈ గ్లింప్స్‌లో వినిపిస్తున్న పాట ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో శింబు సినిమాల్లో మంచి ఆదరణ పొందిన ‘మామా మామా మామా’ పాటను ఈ కొత్త ట్రాక్ గుర్తు చేస్తోందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, మాస్ బీట్ ఈ వీడియోకు మరింత ఊపునిచ్చాయి. ఈ పాట పూర్తి వెర్షన్ విడుదలైతే మంచి స్పందన వస్తుందని శింబు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

వి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను, గోల్డ్ మైన్స్ టెలిఫిలిమ్స్ పతాకంపై మనీష్ షా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. వెట్రిమారన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, తాజా గ్లింప్స్‌తో ‘అరసన్’పై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరి వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Updated Date - Nov 11 , 2026 | 09:27 AM