భాగ్యరాజ్‌ను ఐస్ బాక్సులో చూడలేకే.. ఊర్వశి షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Jul 08 , 2026 | 03:15 PM
తన గురువు, సినీ దర్శకుడు కె.భాగ్యరాజ్ ఫ్రీజర్ బాక్సు (ఐస్ బాక్సు)లో పడుకునివున్న దృశ్యాన్ని తాను చూడలేనని, అందుకే ఆఖరి సారిగా చూసేందుకు వెళ్లలేదని ప్రముఖ నటి ఊర్వశి పేర్కొన్నారు.
తన గురువు, సినీ దర్శకుడు కె.భాగ్యరాజ్ (K Bhagyaraj) ఫ్రీజర్ బాక్సు (ఐస్ బాక్సు)లో పడుకునివున్న దృశ్యాన్ని తాను చూడలేనని, అందుకే ఆఖరి సారిగా చూసేందుకు వెళ్లలేదని ప్రముఖ నటి ఊర్వశి (Senior Actress Urvashi) పేర్కొన్నారు. గత నెలలో గుండెపోటుతో మరణించిన కె.భాగ్యరాజ్ అంత్యక్రియల్లో కోలీవుడ్ నటీనటులు పాల్గొన్నారు. కానీ, చిత్రపరిశ్రమలో తనకుంటూ ఓ గుర్తింపు, స్టార్ ఇమేజ్ కల్పించిన ఊర్వశి మాత్రం దూరంగా ఉన్నారు. దీనిపై విమర్శలు రావడంతో తాజాగా ఆమె స్పందించారు. ఈ విషయమై ఆమె ఏం చెప్పారంటే..
‘‘భాగ్యరాజ్ ఇకలేరనే వార్తతో కుంగిపోయాను. ఆయన భౌతికకాయాన్ని ఫ్రీజర్ బాక్సులో చూసే ధైర్యం నాకులేదు. అక్కడకు వస్తే నా ఎమోషన్స్‌ను నియంత్రించుకోలేను. మీడియా ముందు ఎమోషనల్ ప్రదర్శించి, ఒక డ్రామా క్రియేట్ చేయడం నాకిష్టం లేదు. పైగా పలువురు పలు రకాలైన కామెంట్స్ చేస్తారు. అలాంటి వాటికి తావ్వివాలని భావించలేదు. పైగా, నేను ఎల్లపుడూ నవ్వుతూనే ఉండాలన్నది భాగ్యరాజ్ సర్ కోరిక. నేను కన్నీరుకార్చడం ఆయనకు ఏమాత్రం నచ్చదు. పైగా ఆయనను జీవం లేని మనిషిగా చూసే శక్తి, ధైర్యం నాకు లేదు. నా మనసులో నా గురువు కోటు, సూటు ధరించి ఎంతో అందంగా ఉన్నారు. ఆ రూపాన్ని మాత్రమే గుర్తు పెట్టుకోవాలని భావించాను. ఆయనను ఐస్‌బాక్సులో చూడాలని నేను భావించలేదు. నిజంగా అంత ధైర్యం నాకు లేదు..’’ ఊర్వశి పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె నిర్ణయానికి సపోర్ట్ ఇస్తుంటే.. మరికొందరు మాత్రం అంత లైఫ్ ఇచ్చిన పర్సన్ ఇక లేరని తెలిసి చూడకుండా ఎలా ఉండగలిగారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజంగానే కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున కూడా ఎవరైనా సెలబ్రిటీ చనిపోతే.. త్వరగా వెళ్లరు. ఆయన చెప్పే కారణం కూడా ఇదే. ఆ సెలబ్రిటీ బతికి ఉన్నప్పుడు నవ్వుతూ కనిపించిన రూపమే నాకు గుర్తుండాలి అని చెబుతుంటారు. ఇప్పుడు ఊర్వశి కూడా అలాగే భావించి, తన గురువును చివరి చూపు చూడడానికి సాహించలేదనే విషయం ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి:
VK Naresh: ఏపీలోనూ తమిళనాడు తరహాలో...
‘రామాయణ’.. అంత రేటు తగ్గడానికి కారణం ఏమిటి?
మహేష్ మమ్మల్ని మోసం చేశాడు.. సీక్రెట్ రివీల్ చేసిన మరదలు