ట్రోలర్స్ కి త్రిష గట్టి కౌంటర్..
ABN, Publish Date - Jun 02 , 2026 | 08:58 PM
అందాల భామ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
అందాల భామ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. సినిమాల కన్నా ఎక్కువ త్రిష వ్యక్తిగత విషయాల గురించే సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. సీఎం విజయ్ ఎక్కడికి వెళ్ళినా పక్కన త్రిష ఉండాల్సిందే. సీఎం కాకముందు ఒక పెళ్ళికి ఇద్దరు కలిసి వెళ్ళి షాక్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ నడుస్తోందని కన్ఫర్మ్ అయ్యింది.
ఇక విజయ్ సీఎం అయ్యాక త్రిషను దూరం పెడతారు అనుకుంటే.. ఆమెతోనే కలిసి కనిపిస్తున్నారు. మూడు రోజుల క్రితం అజిత్ తల్లి మరణించడంతో.. విజయ్ - త్రిష కలిసి వెళ్ళి ఆయనను పరామర్శించారు. దీంతో త్రిషపై వ్యతిరేకత పెరిగిపోయింది. త్రిష వలన సీఎం విజయ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని, పార్టీకి అది మంచిది కాదని కొందరు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఆమెను దూరం పెట్టమని కూడా సలహాలు ఇస్తున్నారు. ఇక ఇలా తనపై ట్రోల్స్ వచ్చిన ప్రతిసారి త్రిష తనదైన రీతిలో ట్రోలర్స్ కి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది.
తాజాగా మరోసారి త్రిష.. ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన పెంపుడు కుక్క హాయిగా పడుకుని ఉన్న ఒక క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ దానికి ఘాటైన క్యాప్షన్ పెట్టుకొచ్చింది. 'నా పర్సనల్ లైఫ్‌లోకి లేదా నా విషయాల్లోకి ముక్కు దూర్చే హక్కు దీనికి మాత్రమే ఉంది' అంటూ చెప్పుకొచ్చింది. అంటే తన పెంపుడు కుక్కకు మాత్రమే తన జీవితంలోకి వచ్చే హక్కు ఉందని, పనిపాటా లేకుండా తన పర్సనల్ లైఫ్‌పై గాసిప్స్ రాస్తూ, ముక్కు దూర్చే ట్రోలర్స్‌కు తన జీవితంలో ఎలాంటి స్థానం లేదని పరోక్షంగా తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.