చాలా అసహ్యంగా ఉంది.. త్రిష సంచలన పోస్ట్
ABN, Publish Date - Jul 04 , 2026 | 09:29 PM
సాధారణంగా ఆన్ లైన్ లో కొనే దుస్తులు ఒక రకమైన వాసన వస్తూ ఉంటాయి. ప్యాక్ ఓపెన్ చేయగానే ఆ వాసన భరించడం చాలా కష్టం. అయితే దీని గురించి ఎవరూ పెద్దగా స్పందించరు.
సాధారణంగా ఆన్ లైన్ లో కొనే దుస్తులు ఒక రకమైన వాసన వస్తూ ఉంటాయి. ప్యాక్ ఓపెన్ చేయగానే ఆ వాసన భరించడం చాలా కష్టం. అయితే దీని గురించి ఎవరూ పెద్దగా స్పందించరు. ప్యాకింగ్ లో అలానే వస్తుందేమో అని అనుకుంటారు. కానీ, స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) మాత్రం ఈ విషయం గురించి స్పందించింది. ఒక క్లాతింగ్ బ్రాండ్ పై త్రిష ఫైర్ అయ్యింది. అసలు ఏం జరిగింది అంటే.. త్రిష.. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ జారా నుంచి కొన్ని డ్రెస్ లు ఆర్డర్ పెట్టింది. తాజాగా ఆ డ్రెస్ లు ఆమె ఇంటికి వచ్చాయి. వెంటనే త్రిష ఆ ప్యాక్ ని ఓపెన్ చేయగానే చెమట కంపు. అసలు తట్టుకోలేనంతగా ఉండడంతో ఆమె వాటిని పక్కన పడేసింది.
ఇక కోపంతో త్రిష ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ జారా కంపెనీపై మండిపడింది. హోమ్ డెలివరీ ద్వారా ఆర్డర్ చేసిన బట్టలు ఒంటి వాసనతో మురికిగా వస్తున్నాయంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది. 'డియర్ జారా.. ఒక చిన్న మనవి. ఇక నుంచి హోమ్ డెలివరీ చేసేటప్పుడు మీరు పంపించే వత్తాల నుంచి ఒంటి వాసన రాకుండా చూసుకోండి. ఇది మూడోసారి. చాలా అసహ్యంగా ఉంది. బట్టలు కనీసం ప్యాక్ చేసే ముందైనా ఒకసారి వాసన చూసి పంపండి' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిజం చెప్పాలంటే ఇది త్రిష సమస్య మాత్రమే కాదు. చాలామంది సామాన్యులు కూడా ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. ఆన్ లైన్ షాపింగ్ కావడంతో.. బ్రాండ్ కంపెనీస్.. షాప్స్ లో ఒకరు ట్రైల్ వేసిన దుస్తులను.. యధాతధంగా ప్యాక్ చేసి పంపించేస్తున్నారు. ఒకరి కంటే ఎక్కువమంది ఆ డ్రెస్ ని ట్రైల్ వేసి ఉంటే.. వారి ఒంటి నుంచి వచ్చిన చెమట ఆ డ్రెస్ కి అలాగే పట్టేస్తుంది. అదే డ్రెస్ హోమ్ డెలివరీ చేయడంతో.. ప్యాక్ ఓపెన్ చేయగానే చెమట కంపు వస్తుంది. ఇదేమి కంపెనీ పట్టించుకోదు. మరి త్రిష ఇన్వాల్వ్ అవ్వడంతో జారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.