సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డబ్బులు సంపాదించుకో.. విజయ్ భార్యకు త్రిష కౌంటర్

ABN, Publish Date - Aug 12 , 2026 | 05:16 PM

దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ (Trisha Krishnan) ఇన్స్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట సరికొత్త చర్చలకు దారితీస్తోంది.

Trisha

దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ (Trisha Krishnan) ఇన్స్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట సరికొత్త చర్చలకు దారితీస్తోంది. ఒకవైపు తమిళనాడు రాజకీయ పరిణామాలు, మరోవైపు దళపతి విజయ్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం కోలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమధ్యనే సంగీత తన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. దానికి కారణం విజయ్ కుటుంబం కోర్టు బయటే ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని, భారీ మొత్తంలో భరణం ఇచ్చేందుకు అంగీకరించడంతో పాటు, కుటుంబ పరువు తీయవద్దని కోరడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


సరిగ్గా ఇదే సమయంలో త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ఈ వయసులో ఇలాంటి డ్రామా చేయడం సిగ్గుచేటు... వెళ్లి కొంత డబ్బు సంపాదించుకుని, ప్రశాంతతను వెతుక్కోండి.. ఒకప్పుడు మీరు ప్రార్థించిన జీవితం ఇప్పుడు మీకు లభించడం ఎంత అదృష్టమో' లాంటి పోస్టులు షేర్ చేయడంపై నెటిజన్లు తీవ్రంగా విశ్లేషిస్తున్నారు. ఈ పోస్ట్ డీఎంకే, అన్నాడీఎంకే రాజకీయ నేతల వ్యాఖ్యలకే కాక, విజయ్ భార్య సంగీతను ఉద్దేశించి పెట్టిందని ప్రచారం గట్టిగా సాగుతోంది.


డబ్బు తీసుకుని ప్రశాంతంగా ఉండమని.. ఒకప్పుడు అలాంటి జీవితమే సంగీత కోరుకున్నదని.. త్రిష పరోక్షంగా చెప్పినట్లు ఉంది. సంగీత ఆనుకున్నది సాధించడంతో త్రిష ఇలా ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చినట్లు కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అయితే త్రిష వివాదం మరింత పెరిగి తన వైపు వస్తుందనే ముందస్తు జాగ్రత్తతోనే ఆ పోస్టును 24 గంటలు తిరగకముందే డిలీట్ చేశారని సోషల్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా త్రిష పెట్టి తొలగించిన ఈ పోస్ట్ ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీగా మారింది.

Updated Date - Aug 12 , 2026 | 05:18 PM