న్యాయమూర్తి మంచి తీర్పు ఇచ్చారు.. రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా
ABN, Publish Date - Aug 02 , 2026 | 03:16 PM
నటుడు రవి మోహన్ కు తన కుమార్తె ఆర్తికి మేమేమి దొంగ చాటుగా వివాహం చేయలేదని, ఆర్తి తల్లి, సినీ నిర్మాత సుజాత విజయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నటుడు రవి మోహన్ (Ravi Mohan) కు తన కుమార్తె ఆర్తి (Aarti)కి మేమేమి దొంగ చాటుగా వివాహం చేయలేదని, వారిని వేరు చేయాలని తాము ఎన్నడూ భావించలేదని రవి మోహన్ అత్త, ఆర్తి రవి తల్లి, సినీ నిర్మాత సుజాత విజయకుమార్ (Sujatha Vijayakumar) చెప్పారు.
శనివారం చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ తల్లీ తన పిల్లలను భర్త నుంచి వేరు చేయాలని భావించదన్నారు. పది వేల మంది ఆహ్వానితుల సమక్షంలో పదికి పైగా వివిధ రకాల కార్యక్రమాల మధ్య వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశామన్నారు. కానీ ఇప్పుడు పరిస్ధితి అందుకు విరుద్దంగా ఉందని అన్నారు.
అయితే.. ఈ నెల నుంచి రవిమోహన్ దంపతులు, వారి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ నెలకోసారి కలుసుకుని మాట్లాడుకోవాలని ఇటీవల కోర్టు సూచించిందన్నారు. ఇలాంటి మంచి తీర్పును వెలువరించిన న్యాయమూర్తికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు సుజాత పేర్కొన్నారు.