తమిళ చిత్రపరిశ్రమ భారీ ప్లాన్.. సీనియర్ నటులకు జీవిత సాఫల్య పురస్కారాలు!
ABN, Publish Date - Nov 17 , 2026 | 10:15 AM
తమిళ నిర్మాతల సంఘం వచ్చే ఏడాది పొంగల్‌కు భారీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది.
తమిళ చిత్రపరిశ్రమ ఆధ్వర్యంలో పొంగల్‌కు భారీ వేడుక నిర్వహించి సీనియర్ నటీనటులకు 'జీవిత సాఫల్య పురస్కారాలను (Lifetime Achievement Awards) ప్రదానం చేయాలని తమిళ నిర్మాతల సంఘ నిర్వాహకులు (Tamil Film Producers Association) నిర్ణయించారు. తమిళ సినీ నిర్మాతల సంఘ నిర్వాహకుల సమావేశం ఇటీవల చెన్నైలో జరిగింది. ఇందులో సీనియర్ నిర్మాతలు, మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాతల సంఘం అధ్యక్షుడు జీకేఎం తమిళ్ కుమరన్ (GKM Tamil Kumaran) మీడియాతో మాట్లాడుతూ.. 'సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలని, కొత్త సినిమాల విడుదల సమయంలో ఉదయం ఆటకు అనుమతివ్వాలని ముఖ్య మంత్రి విజయ్‌కు విజ్ఞప్తి చేసిన వెంటనే తమ కోర్కెలను నెరవేర్చారని, ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ముఖ్యంగా 2015 నుంచి 2022 వరకు సుమారుగా 244 చిత్రాలకు సబ్సీడీ మొత్తంగా రూ.15.64 కోటు మంజూరు చేశారని వెల్లడించారు.
వచ్చే యేడాది సంక్రాంతికి తమిళ సినీ నిర్మాతల సంఘం తరపున పొంగలు ప్రత్యేకంగా భారీ వేడుకను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా అగ్ర నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించే చిత్రానికి సండియార్ (Sandiyar) అనే పేరు పెట్టడంపై రాజకీయ వివాదం చెలరేగిందన్నారు. నిర్మా తల సంఘంలో ఓ నిర్మాత ఒక టైటిల్ రిజిస్టర్ చేయించుకుంటే పదేళ్ళ పాటు ఆయనకే సొంతమన్నారు ఆ తర్వాత ఆయన అనుమతి తీసుకుని అదే టైటిల్‌ను మరో చిత్రానికి ఉపయోగించుకోవచ్చని అన్నారు. అయితే, 13 యేళ్ళ క్రితం సండియార్ పేరుతో ఒక చిత్రం విడుద లకాగా, అపుడు ఎలాంటి రాజకీయ వివాదం తలెత్తలేదని ఆయన గుర్తు చేశారు.