సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

లండన్ వెళ్తోన్న విజయ్.. భార్య కోసమా.. ప్రేయసి కోసమా

ABN, Publish Date - Sep 04 , 2026 | 08:06 PM

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ (Vijay) త్వరలోనే బ్రిటన్ పర్యటనకు వెళ్తుండటం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

CM Vijay

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ (Vijay) త్వరలోనే బ్రిటన్ పర్యటనకు వెళ్తుండటం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడుకు నూతన పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తరఫున అధికారిక పర్యటనగా ఈ లండన్ టూర్ ఖరారైనప్పటికీ, విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా లండన్‌లో నివసిస్తున్న ఆయన భార్య సంగీత, కుమార్తె దివ్యను ఈ పర్యటనలో విజయ్ కలవనున్నారనే వార్త ప్రచారంలోకి రావడంతో ఈ టూర్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.


గత కొన్ని నెలలుగా విజయ్, సంగీతల దాంపత్య జీవితంలో మనస్పర్థలు రావడం, విడాకుల వరకు వ్యవహారం వెళ్ళడం అందరికీ తెల్సిందే. నటి త్రిషతో విజయ్ కి సంబంధం ఉందని సంగీత డైరెక్ట్ గా అంగీకరించి.. విడాకులకు పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే ఇటీవలే చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో వీరిద్దరి మధ్య సమస్యలు సర్దుముణిగాయా అనే కోణంలో కొత్త చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో విజయ్ లండన్ వెళ్లడం, అక్కడ తన కుటుంబాన్ని కలవబోతున్నారనే సంకేతాలు రావడంతో, ఇన్నాళ్లుగా సాగుతున్న పర్సనల్ లైఫ్ రూమర్స్‌కు చెక్ పడబోతోందని అభిమానులు ఆశిస్తున్నారు.


మరోవైపు, నటి త్రిష కూడా తన కొత్త సైకలాజికల్ హారర్ సినిమా షూటింగ్ కోసం లండన్‌లోనే ఉండటం, విజయ్ కూడా అదే సమయంలో అక్కడికి వెళ్తుండటంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ లండన్ వెళ్తున్నాడని తెలిసే త్రిష ముందు లండన్ ట్రిప్ కి వెళ్ళిందని, ఆమెను విజయ్ కచ్చితంగా అక్కడ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్ నడుస్తోంది. అసలు విజయ్ భార్య కోసం వెళ్తున్నాడా.. ప్రేయసి కోసం వెళ్తున్నాడా అంటే ఇది కేవలం తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అధికారిక పారిశ్రామిక పర్యటన మాత్రమేనని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విజయ్ తన పర్యటనలో కుటుంబ సభ్యులను కలుస్తాడా.. లేదా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Updated Date - Sep 04 , 2026 | 08:06 PM