సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విజయ్ చివరి సినిమా.. క్యాష్ చేసుకుంటున్న నిర్మాతలు

ABN, Publish Date - Jul 22 , 2026 | 03:30 PM

సినీ రంగానికి వీడ్కోలు పలికి తమిళగ వెట్రి కళగమ్ పార్టీతో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్ (Vijay) చివరి చిత్రం జననాయగన్ (Jana Nayagan) ఎట్టకేలకు జూలై 23న విడుదలకు సిద్ధమైంది.

Jana Nayagan

సినీ రంగానికి వీడ్కోలు పలికి తమిళగ వెట్రి కళగమ్ పార్టీతో తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్ (Vijay) చివరి చిత్రం జననాయగన్ (Jana Nayagan) ఎట్టకేలకు జూలై 23న విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ సమస్యలు, కోర్టు కేసులు, పైరసీ ముప్పు వంటి ఎన్నో అడ్డంకులను దాటుకుని వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. బాలికల విద్య, సమానత్వం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత వెంకట్ కె. నారాయణ విజయ్‌కు ఓ వీడ్కోలు బహుమతిగా అభివర్ణించారు. అయితే, ఈ సినిమా బాలకృష్ణ భగవంత్ కేసరి కథను పోలి ఉందనే వార్తలపై నిర్మాత స్పందిస్తూ, కేవలం రెండు సీన్లలో మాత్రమే పోలికలు ఉంటాయని, కథ పూర్తిగా వేరని స్పష్టత ఇచ్చారు.


అయితే, ఈ సినిమా విడుదల సమయానికి ఒక కొత్త వివాదం తెరపైకి వచ్చింది. స్వరాష్ట్రంలో తమిళనాడు సీఎం విజయ్ సూచనల మేరకు చెన్నైలో టికెట్ ధరను కేవలం రూ. 183 నుంచి రూ. 190కి మాత్రమే స్వల్పంగా పెంచారు. కానీ, ఇతర రాష్ట్రాలు, రాజధానుల్లో మాత్రం టికెట్ ధరలను మితిమీరి పెంచడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ చివరి సినిమా అనే క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకే నిర్మాత ధరలు భారీగా పెంచారని, ఇది సగటు ప్రేక్షకుడి జేబుకు కన్నం పెట్టడమేనని ట్రేడ్ వర్గాలు విమర్శిస్తున్నాయి.


టికెట్ ధరల పెంపును పరిశీలిస్తే.. బెంగళూరులో రూ. 200 టికెట్ ఏకంగా రూ. 2000కి చేరగా, హైదరాబాద్, కొచ్చిలలో రూ. 150 టికెట్ రూ. 700కి పెరిగింది. ఇక ఢిల్లీలో రూ. 900, ముంబైలో రూ. 1000 దాటడంతో ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఈ రేంజ్ బాదుడు వల్ల ఇతర రాష్ట్రాల్లో ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇతర రాష్ట్రాల్లో పెరిగిన ఈ భారాన్ని తట్టుకుని విజయ్ చివరి సినిమా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.

Updated Date - Jul 22 , 2026 | 03:34 PM