సీన్.. టైటిల్ తోనే పిచ్చోళ్లని చేశారుగా

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:14 PM

సినిమాల్లో ట్విస్ట్ లు ఉండడం సహజమే. కానీ, కొన్ని ట్విస్టులు ఉంటాయి.. ప్రేక్షకులను పిచ్చోళ్ళను చేస్తాయి. ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే ఫ్రాంక్ చేసినట్లు ఉంటుంది.

Suriya

సినిమాల్లో ట్విస్ట్ లు ఉండడం సహజమే. కానీ, కొన్ని ట్విస్టులు ఉంటాయి.. ప్రేక్షకులను పిచ్చోళ్ళను చేస్తాయి. ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే ఫ్రాంక్ చేసినట్లు ఉంటుంది. డార్లింగ్ సినిమా గుర్తుంది కదా.. అందులో ఫస్ట్ హాఫ్ అంతా డైరెక్టర్, జనల్ని పిచ్చోళ్ళను చేస్తాడు. లేని కథను ఉందని నమ్మించి ప్రేక్షకుల మైండ్ పోయేలా చేస్తాడు. ఇక ఇలాంటి షాక్ నే ఇచ్చాడు మరో డైరెక్టర్ జీతూ మాధవన్. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం సీన్ (Scene). కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నజ్రియా జంటగా మలయాళ కుర్ర హీరో నస్లెన్ విలన్ గా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.


అసలు ఎలాంటి బజ్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అటు తమిళ్ లో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులను కూడకా విపరీతంగా ఆకట్టుకుంటుంది. కథ చాలా సింపుల్ గానే ఉన్నా.. మంచి ట్విస్టులు, కామెడీతో ప్రేక్షకులను అలరించింది. మొదటి నుంచి ఈ సినిమా కథకు సంబంధించి ఏ విషయాన్ని మేకర్స్ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో థియేటర్ లో చూసిన ప్రేక్షకుడికి అన్ని ఒక సర్ ప్రైజ్ ప్యాకింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా టైటిల్ తోనే జీతూ.. ప్రేక్షకులను పిచ్చోళ్ళను చేశాడు. సీన్ (Scene) అంటే ఒక నాటకంలోని చిన్న సన్నివేశాన్ని సీన్ అంటారు. ఇది అందరికీ తెల్సిందే. అంతేకాకుండా సూర్య పోలీస్ కావడంతో క్రైమ్ సీన్స్ చూడాల్సివస్తోంది.. ఇందుకోసమే ఈ టైటిల్ ని ఎంచుకున్నారని అందరు అనుకున్నారు. ఈ ట్రైలర్ చూసినవాళ్లు.. సూర్య సీన్ చూపిస్తాడు అని ఒక ఎలివేషన్ ఇచ్చుకొని థియేటర్ కి వచ్చి కూర్చుంటే.. నిజంగానే డైరెక్టర్ ప్రేక్షకులకు సీన్ చూపించాడు.


సినిమా స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాలకు కానీ తెలియదు.. అసలు సీన్ అంటే అర్ధం ఏంటో.. ? అది తెలిసాకా జనాలు పిచ్చివాళ్ళు అవ్వకమానరు. సీన్ అంటే సన్నివేశం కానీ, ఎలివేషన్ కానీ కాదు. అది వేరే సీన్ అని అర్ధమయ్యేసరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. సూర్యకు ఈ సినిమాలో కళ్లు పోతాయి. దీంతో అతను చూడలేడు. దాన్ని బేస్ చేసుకొని సీన్ అనే టైటిల్ పెట్టాడు. ఆ విషయాన్ని జీతూ క్లారిటీగా చూపించాడు కూడా. టైటిల్ ని ఇంగ్లీష్ లో 'scene' అని పెట్టి.. సినిమా మధ్యలో 'Seen' అని చూపించి షాక్ ఇచ్చాడు. సీన్ అంటే చూడడం .. హీరో కళ్ళతో చూడలేకపోయినా.. తన మైండ్ తో అన్ని చూస్తాడు అదే కథ కావడంతో సినిమాకి యాప్ట్ గ ఉంటుందని ఈ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ జనాలను ఇంత పిచ్చోళ్ళను చేయాలా జీతూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఒక చూపు లేని పోలీస్.. 100 కి పైగా హత్యలు చేసిన హంతకుడిని పట్టుకోవడం నెక్స్ట్ లెవెల్ ఎంటర్ టైనర్ అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ముందు ముందు ఎన్ని రికార్డులు బడ్డలుకొడుతుందో చూడాలి.

Updated Date - Nov 07 , 2026 | 06:19 PM