జస్ట్ గాడ్ థింగ్స్.. అతనికి కారు గిఫ్ట్ ఇచ్చిన సూర్య
ABN, Publish Date - May 31 , 2026 | 03:15 PM
ఇండస్ట్రీలో సినిమా హిట్ అయితే.. నిర్మాతలు కానీ, హీరో కానీ.. డైరెక్టర్ కి కారు, వాచ్ లు గిఫ్ట్ ఇవ్వడం ట్రెండ్ గా మారింది. ముఖ్యంగా తమిళ్ నిర్మాతలు ఎక్కువగా ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.
ఇండస్ట్రీలో సినిమా హిట్ అయితే.. నిర్మాతలు కానీ, హీరో కానీ.. డైరెక్టర్ కి కారు, వాచ్ లు గిఫ్ట్ ఇవ్వడం ట్రెండ్ గా మారింది. ముఖ్యంగా తమిళ్ నిర్మాతలు ఎక్కువగా ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. అయితే కోలీవుడ్ హీరో సూర్య (Suriya).. డైరెక్టర్ కి బదులు సినిమాటోగ్రాఫర్ కి ఒక బ్రాండ్ న్యూ కారును గిఫ్ట్ గా ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కరుప్పు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మే 14 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కలక్షన్స్ మాత్రం భారీగానే రాబడుతోంది. ఇప్పటివరకు సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలక్షన్స్ రాబట్టి షాక్ ఇచ్చింది. దాదాపు రూ. 300 కోట్లు రాబట్టి రికార్డ్ సృష్టిస్తోంది. ఇక కరుప్పు సినిమాలో సూర్య లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. లాయర్ గా స్టైలిష్ గా కనిపిస్తూనే.. వీరభద్రుడిగా గూస్ బంప్స్ తెప్పించాడు. ఇదంతా సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు మ్యాజిక్ అని చెప్పొచ్చు.
ఇక జికె విష్ణు పనితనం మెచ్చి సూర్య ఆయనకు ఒక లగ్జరీ కారును బహుమతిగా అందించాడు. సూర్య ఇచ్చిన కారు పక్కన నిలబడి విష్ణు ఫోటో దిగి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కరుప్పులో సూర్య చెప్పిన డైలాగ్ తో ఆయనకు థాంక్స్ చెప్పాడు. ' జస్ట్ గాడ్ థింగ్స్.. థాంక్యూ సూర్య సార్.. మీది చాలా పెద్ద మనసు' అంటూ తెలిపాడు. ఇక కారు విషయానికొస్తే.. ఇదొక మహీంద్రా ఈవీ కారు. మహీంద్రా BE6, బ్యాట్‌మ్యాన్ ఎడిషన్. పూర్తి ప్రీమియం లుక్‌తో, అగ్రెసివ్ డిజైన్‌తో కూడిన క్లాసీ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్‌తో ఉన్న ఈ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ ధర సుమారు రూ.30 లక్షల నుండి రూ.40 లక్షల వరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూర్య చేసిన ఈ పనికి ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.