సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మణిరత్నం డైరెక్షన్ లో సూర్య, ధనుష్.. మరో పొన్నియన్ సెల్వన్ అవ్వదుగా

ABN, Publish Date - Nov 02 , 2026 | 04:13 PM

కోలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించేందుకు ఒక అరుదైన కాంబినేషన్ రూపుదిద్దుకుంటోంది. కోలీవుడ్‌ స్టార్ హీరోలు ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపించనున్నారు.

Suriya- Dhanush

కోలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించేందుకు ఒక అరుదైన కాంబినేషన్ రూపుదిద్దుకుంటోంది. కోలీవుడ్‌ స్టార్ హీరోలు ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపించనున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ కి దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించడంతో తమిళ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ కూడా ఈ సినిమా వైపు తొంగిచూస్తోంది. ఆ స్టార్ హీరోలు ఎవరో కాదు.. వర్సటైల్ స్టార్స్ సూర్య (Suriya), ధనుష్ (Dhanush). ఈ కాంబో గురించి వింటూనే గూస్ బంప్స్ వస్తున్నాయని తమిళ తంబీలు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.


ఒకప్పుడు కల్ట్ సినిమాలను తెరకెక్కించిన మణిరత్నం ఈ మధ్యకాలంలో ఒక్క మంచి హిట్ ని కూడా అందుకోలేకపోయాడు. అప్పుడెప్పుడో బాహుబలి రేంజ్ లో పొన్నియన్ సెల్వన్ ని తెరకెక్కించాడు. ఆ సినిమా తెలుగు వారికే కాదు తమిళ్ వాళ్ళకు కూడా అంతగా ఎక్కలేదు. ఇక ఈ సినిమా తరువాత కమల్ హాసన్ తో థగ్ లైఫ్ ని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్.. ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు అంటూ నెటిజన్స్ ఆయన గురించి కామెంట్స్ చేశారు. అయితే ఈసారి కచ్చితంగా హిట్ ట్రాక్ ఎక్కాలని మణిరత్నం తనకు అచ్చివచ్చిన లవ్ స్టోరీతో రాబోతున్నాడు.


విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇంజి వెల్లమ్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ఇక దీని తరువాత మణిరత్నం.. సూర్య - ధనుష్ లతో ఒక పవర్‌ఫుల్ టూ-హీరో స్క్రిప్ట్‌ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన ఈ కథకు సంబంధించి సూర్య, ధనుష్ ఇద్దరినీ సంప్రదించారని, వారు కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపించినట్లు తెలిసింది. ప్రస్తుతం రెమ్యూనరేషన్, డేట్స్, షూటింగ్ షెడ్యూల్స్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ఇవన్నీ అనుకూలిస్తే త్వరలోనే ఈ క్రేజీ మల్టీస్టారర్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ వార్త వినగానే నెటిజన్స్.. ఇది కూడా పొన్నియన్ సెల్వన్ లా అయితే అవ్వదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Nov 02 , 2026 | 04:13 PM