Scene: సిగరెట్లు తాగితే మగతనం తగ్గిపోతుందిరోయ్..
ABN, Publish Date - Oct 26 , 2026 | 10:13 PM
కోలీవుడ్ స్టర్ హీరో సూర్య (Suriya) ఈ ఏడాది రెండు సినిమాలతో భారీ హిట్లు అందుకొని ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అయ్యాడు. జీతూ మాధవన్ (Jittu Madhavan) దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం సీన్.
కోలీవుడ్ స్టర్ హీరో సూర్య (Suriya) ఈ ఏడాది రెండు సినిమాలతో భారీ హిట్లు అందుకొని ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అయ్యాడు. జీతూ మాధవన్ (Jittu Madhavan) దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం సీన్. 2డి ఎంటర్టైన్మెంట్ (2D Entertainment) బ్యానర్‌పై జ్యోతిక - సూర్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించగా.. మలయాళ కుర్ర హీరో నెస్లెన్ విలన్ గా కనిపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను పెంచేసింది.
ఇక తాజాగా సీన్ సినిమాలో సూర్య డీఎస్పీ ప్రేమ్‌రాజ్ గా కనిపించనున్నాడు. తాజాగా ఆయనకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సూర్య చాలా చిల్డ్ పోలీస్ గా కనిపించాడు. రీల్స్ చేస్తూ కేసు సాల్వ్ చేసే ఆఫీసర్ గా స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. ఇన్నిసిగరెట్లు తాగితే మగతనం తగ్గిపోతుందిరోయ్ అంటూ వచ్చే డైలాగ్.. చివర్లో కేసు సాల్వ్ అవ్వలేదు ఇంకా ఉంది అని చెప్పడం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఆయన స్వాగ్ ని మ్యాచ్ అయ్యేలా వెనుక రెస్పెక్టా సాంగ్ బీట్స్ అయితే వేరే లెవెల్ లో ఉంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం అమెరికా చరిత్రలోనే అత్యంత భయంకరమైన సీరియల్ కిల్లర్ డీన్ కోర్ల్ అలియాస్ క్యాండీ మ్యాన్ ఆధారంగా నెస్లెన్ పాత్రని రాసుకున్నట్లు సమాచారం. 1970 నుంచి 1973 మధ్య కాలంలో టెక్సాస్‌లోని హ్యూస్టన్, పాసడేనా ప్రాంతాల్లో కనీసం 28, 29 మంది టీనేజ్ పిల్లలని, యువకులను కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులకు గురిచేసి, చిత్రహింసలు పెట్టి అత్యంత దారుణంగా హత్య చేశాడట. ఇప్పుడు ఈశ్వరన్ పాత్ర కూడా అలానే ఉండబోతుందని తమిళ్ మీడియా రాసుకొచ్చింది. అతనిని పట్టుకోవడానికి డీఎస్పీ ప్రేమ్‌రాజ్ ఒక వింతైన టీమ్ ని ఏర్పాటు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడమే ప్రధాన కథ అని టాక్. ఇదే కనుక నిజమైతే సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత.. ? డీఎస్పీ ప్రేమ్‌రాజ్ - ఈశ్వరన్ టామ్ అండ్ జెర్రీ కథ ఎలా ఉంటుందో చూడాలంటే నవంబర్ 6 న సీన్ రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.