Rajinikanth: మాట్లాడినా తిడతారు, మాట్లాడకపోయినా తిడతారు
ABN, Publish Date - Jun 24 , 2026 | 04:45 PM
ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అంటూ తలైవఆ ఫ్యాన్స్ పాడుకుంటున్నారు. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మిస్తోన్న చిత్రం తలైవర్ 173.
ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అంటూ తలైవఆ ఫ్యాన్స్ పాడుకుంటున్నారు. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మిస్తోన్న చిత్రం తలైవర్ 173. సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతోన్నా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళింది లేదు. దానికి కారణం ఈ సినిమాకు డైరెక్టర్లు మారుతూ ఉండడమే. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు డైరెక్టర్లు మారి చివరకు అశ్వత్ మారిముత్తు దగ్గరకు వచ్చి ఆగింది. తాజాగా తలైవర్ 173 టైటిల్ లాంచ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాకు ‘ధర్మాన్’ (Dharmaan) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు.
ఇక ఈ టైటిల్ లాంచ్ వేడుకలో రజనీకాంత్ తన కొత్త సినిమా విశేషాలను పంచుకోవడంతో పాటు, ప్రస్తుత సమాజంలో మనుషుల ప్రవర్తన, విమర్శలు, అభిమానంపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఆయనపై వస్తోన్న విమర్శల గురించి రజనీ మాట్లాడారు. దళపతి విజయ్ సీఎం అయిన్నప్పుడు .. రజనీ మౌనం వహించడం వెనుక ఏదో కారణం ఉందని అప్పట్లో చాలా ట్రోలింగ్ నడించింది. దాని గురించే రజనీ వివరణ ఇచ్చారు. తానేదైనా విషయంపై మాట్లాడినా, లేదా మాట్లాడకపోయినా కొందరు నెగిటివ్ గా తిడుతూనే ఉంటారని చెప్పుకొచ్చారు.
"నేను ఒక విషయంపై మాట్లాడకపోతే ఏమైందని ప్రశ్నిస్తారు, అదే మాట్లాడితే ముందే మాట్లాడాల్సింది కదా అంటారు. మనం ఏం చేసినా కొందరికి అస్సలు నచ్చదు.. మనల్ని ప్రాణంగా ప్రేమించే వారు మనం చేసే ప్రతి పనినీ ఖచ్చితంగా ఇష్టపడతారని అనుకోవడం కూడా చాలా పెద్ద అవివేకమే అవుతుంది" అని తలైవా పేర్కొన్నారు. సమాజంలో మనల్ని విమర్శించేందుకు ఒక వర్గం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ధర్మాన్ సినిమాతో రజనీ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.