ధర్మాన్.. శ్రీలీల కన్ఫర్మ్
ABN, Publish Date - Sep 30 , 2026 | 08:40 PM
అందాల భామ శ్రీలీలకు అసలు కలిసిరావడం లేదు. ఏది ముట్టుకున్నా కూడా ఆమెకు మిస్ ఫైర్ అవుతుంది. అందుకే కొద్దిగా గ్యాప్ తీసుకున్న శ్రీలీల ఎట్టకేలకు సూపర్ ఛాన్స్ పట్టేసింది.
అందాల భామ శ్రీలీల (Sreeleela)కు అసలు కలిసిరావడం లేదు. ఏది ముట్టుకున్నా కూడా ఆమెకు మిస్ ఫైర్ అవుతుంది. అందుకే కొద్దిగా గ్యాప్ తీసుకున్న శ్రీలీల ఎట్టకేలకు సూపర్ ఛాన్స్ పట్టేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న భారీ చిత్రం ధర్మాన్ (Dharman) లో శ్రీలీల కూడా నటిస్తోంది. ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడని తెలియడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో రాశీ ఖన్నా ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు రాశీ ఖన్నాతో పాటు శ్రీలీల కూడా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.
తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఒక లీక్డ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఒక జాతర వాతావరణం ఉన్న సెట్‌లో రజనీకాంత్, రామ్ పోతినేని, రాశీ ఖన్నాతో పాటు శ్రీలీల కూడా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీరంతా ఎంతో సరదాగా నవ్వుతూ ముచ్చటిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించడంతో, శ్రీలీల కూడా ఈ సినిమాలో నటిస్తోందనే విషయం ఖరారైంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి.
గతంలో రామ్ పోతినేని, శ్రీలీల స్కంద చిత్రంలో కలిసి నటించారు. ఇప్పుడుధర్మన్ లో కూడా శ్రీలీల రామ్‌కు జోడీగా కనిపిస్తుందా లేక రజనీకాంత్‌తో ఏదైనా ప్రత్యేకమైన పాత్ర చేయబోతుందా అనేది చిత్రబృందం అధికారికంగా వెల్లడించేవరకు సస్పెన్స్‌గానే ఉండనుంది. మరి ఈ సినిమాతోనైనా శ్రీలీల హిట్ ట్రాక్ ఎక్కుతుందా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.