రజనీ సినిమా.. మళ్ళీ మారిన డైరెక్టర్
ABN, Publish Date - Jun 03 , 2026 | 09:11 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) సినిమాకు ఇంకా దర్శకుడు దొరకలేదా అంటే నిజమే అని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీ నటిస్తోన్న చిత్రం తలైవర్ 173 (Thalaivar 173)
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) సినిమాకు ఇంకా దర్శకుడు దొరకలేదా అంటే నిజమే అని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీ నటిస్తోన్న చిత్రం తలైవర్ 173 (Thalaivar 173). ఈ సినిమా ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారో కానీ, ఇప్పటివరకు ఒక్క దర్శకుడు కూడా ఫైనల్ కాలేదు. మొదట సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ కమల్- రజనీ అధికారికంగా ప్రకటించారు. కానీ, ఇంత పెద్ద సినిమాను నిర్మించడం, అంచనాలను అందుకోవడం తనకు ఎంతో ఒత్తిడితో కూడుకున్న వ్యవహారంగా అనిపించడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.
ఇక సుందర్ సి తరువాత తలైవర్ 173 ని ఎవరు హ్యాండిల్ చేస్తారా అని ఎదురుచూస్తుంటే.. డాన్ సినిమా ఫేమ్ యంగ్ డైరెక్టర్ శిబి చక్రవర్తిని దర్శకుడిగా ఎంపిక చేసి, ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు. కానీ కొన్ని రోజులుగా స్క్రిప్ట్ పరమైన మార్పులు, ఇతర కారణాల వల్ల శిబి చక్రవర్తి కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుండి సైలెంట్‌గా తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించాయి. దాని మీద మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వలేదు.
ఇలా డైరెక్టర్లు రావడం, పోవడం తప్ప ఒక్కరు కూడా రజనీని డైరెక్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. అయితే గత కొన్నిరోజులుగా ఓ మై కడవులే, డ్రాగన్ వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు .. ఈ సినిమా బాధ్యతలు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా మరోసారి రజనీ సినిమాకు డైరెక్టర్ మారాడా.. ? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇద్దరు డైరెక్టర్ల తరువాత కమల్.. అశ్వత్ మారిముత్తునే ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే శిబిని వదిలేసినట్లేనా అంటే కాదంట. ఈ సినిమా కాకుండా కమల్ ప్రొడక్షన్ లో మరో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడైనా తలైవర్ 173 సెట్స్ పైకి వెళ్తుందా.. ? ఈ డైరెక్టర్ ని కూడా తొలగిస్తారా.. ? అనేది చూడాలి.