కోలీవుడ్లోకి పంజాబీ భామ షెర్రీ అగర్వాల్.. తొలి సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Nov 04 , 2026 | 08:06 AM
తెలుగు, పంజాబీ సినిమాల తర్వాత కోలీవుడ్లోకి షెర్రీ అగర్వాల్.. 'సైకిల్ గ్యాప్'తో తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ భామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు!
నటిగా తమిళ చిత్రసీమలోకి అడుగు పెట్టడం ఎంత అదృష్టంగా భావిస్తున్నట్లు పంజాబీ గర్ల్ షెర్రీ అగర్వాల్ (Sherry Agarwal) చెప్పుకొచ్చారు. దక్షిణ భారత చిత్రసీమలో కాజల్ అగర్వాల్, సోనియా అగర్వాల్, సాక్షి అగర్వాల్ రాణించి తమకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో షెర్రీ అగర్వాల్ కోలీవుడ్లోకి (Kollywood Debut) ఎంట్రీ ఇస్తున్నారు.
ఇప్పటికే పంజాబీ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన షెర్రీ అగర్వాల్ తమిళంలో తొలిసారి సైకిల్ గ్యాప్ (Cycle Gap) అనే చిత్రం ద్వారా అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ, 'నటిగా మంచి చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగు పెట్టడం ఎంతో సంతోషంగా వుంది. తమిళ కళాకారులతో తమిళ గడ్డపై షూటింగులో పాల్గొనడం మరచిపో లేని అనుభూతినిచ్చింది.
మున్ముందు కూడా మంచి కథా పాత్రలు ఎంచుకుని తమిళ ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకోవాలన్నదే లక్ష్యం ఇందుకోసం వ్యక్తిగత ప్రతిభతో నన్ను నేను నిరూపించుకునేందుకు కృషి చేస్తాను. ఇక 'సైకిల్ గ్యాప్' చిత్రాన్ని అన్ని తరాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది' అని పేర్కొన్నారు.