Gentleman: శంకర్ తొలిచిత్రం.. 'జెంటిల్‌మెన్' రీ-రిలీజ్
ABN, Publish Date - Nov 29 , 2026 | 12:46 PM
1993లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన జెంటిల్ మెన్ చిత్రం తిరిగి రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
దిగ్గజ దర్శకుడు శంకర్ (S. Shankar) తొలిసారి తెరకెక్కించిన చిత్రం జెంటిల్ మెన్ (Gentleman) 1993లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆర్జున్ (Arjun), మధుబాల (Madhubala) జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం ఏఆర్.రెహమాన్ (A. R. Rahman). కేటీ కుంజుమోన్ (K. T. Kunjumon) నిర్మించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారు. ఆధునిక 4కే టెక్నాలజీతో సరికొత్త కలర్ ప్రింట్‌తో డిసెంబరు 11న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ విషయంపై నిర్మాత కెటీ కుంజుమోన్ మాట్లాడుతూ.. 'ఈ రీ రిలీజ్ పాత తరానికి మధుర జ్ఞాపకాలను తిరిగి తీసుకొస్తుంది. కొత్త తరానికి సినిమా దృశ్యాలు, సంగీతాన్ని వెండితెరపై ఆస్వాదించే అవకాశాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఆ రోజుల్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించాం. 33 యేళ్ళ తర్వాత రీ రిలీజ్ చేస్తున్నాం.
ఆ తర్వాత నిర్మించిన 'కాదల్ దేశం', 'రాక్షసన్', 'సూర్యన్' వంటి చిత్రాలను వరుసగా విడుదల చేస్తాం. ప్రస్తుతం 'జెంటిల్‌మెన్-2' చిత్రీక రణ తొలి షెడ్యూల్ పూర్తయిందని, తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ పనులు జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ప్రారంభిస్తామని వివరించారు.