Sardar 2 Teaser : షో వాళ్లదే అయినా షో స్టీలర్ నేనే
ABN, Publish Date - Jul 31 , 2026 | 07:53 PM
కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) కెరీర్ లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాల్లో సర్దార్ (Sardar) ఒకటి. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2022 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) కెరీర్ లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాల్లో సర్దార్ (Sardar) ఒకటి. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2022 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ డబుల్ రోల్ లో కనిపించాడు. ఇక దాదాపు నాలుగేళ్ల తరువాత సర్దార్ కి సీక్వెల్ రాబోతుంది. సర్దార్ 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో సంచలన నటుడు ఎస్.జె.సూర్య (SJ Suryah) విలన్‌గా ఒక పవర్‌ఫుల్ అండ్ స్టైలిష్ పాత్రలో నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా సర్దార్ 2 టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. టీజర్ మొత్తాన్ని ఎస్.జె.సూర్య వాయిస్ ఓవర్‌తో ఒక ఆసక్తికరమైన పొడుపుకథ రూపంలో కథాంశాన్ని వివరించారు. 'ఇద్దరు గూఢచారులు.. తండ్రి ఒక పల్లెటూరి బైతు కానీ చాలా బలాఢ్యుడు, కొడుకు కూల్ గాయ్ కానీ చాలా టఫ్.. కానీ ఈ షోని దొంగిలించేది నేనే' అని చెప్తుండగా.. కార్తీ ఎంట్రీ అదిరిపోయింది. టీజర్‌లో చూపించిన హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు, హెలికాప్టర్ బ్లాస్ట్‌లు, విమానంలో జరిగే ఫైట్‌లు, సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం, విజువల్స్‌కి గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.
కార్తీ డ్యూయల్ రోల్‌లో తండ్రి, కొడుకులుగా ఊరమాస్ లుక్‌లో కనిపిస్తుండగా, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో మెరిశారు. మంచి విలన్ వర్సెస్ చెడ్డ హీరోలు అనే సరికొత్త పాయింట్‌ను టీజర్‌లో చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సీక్వెల్ తో కార్తీ తెలుగు, తమిళ్ భాషల్లో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.