ప్లీజ్‌... కులం పేరు వాడొద్దు - హీరో

ABN , Publish Date - Jun 18 , 2026 | 10:12 AM

తన పేరు వెనుక ఉండే ‘రెడ్డి’ అనే కులం పేరును జోడించి పిలవొద్దని, రాయొద్దని హీరో సనంత్‌ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హార్టిన్‌’ వేడుకలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.

Heartin Movie Still

తన పేరు వెనుక ఉండే ‘రెడ్డి’ అనే కులం పేరును జోడించి పిలవొద్దని, రాయొద్దని హీరో సనంత్‌ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హార్టిన్‌’ (Heartin). ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ఆడియో, ట్రైలర్‌ను తాజాగా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సనంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. (Heartin Audio and Trailer Launch)


‘ఇక నుంచి తనను పూర్తి పేరు సనంత్‌ రెడ్డి (Sananth Reddy) అని పిలవొద్దని, కేవలం సనంత్‌ అని పిలిస్తే చాలు’ అని కోరారు. సాధారణంగా ఇతర భాషల్లో తమ పేరుతో పాటు కులం పేరు ఉంటుంది. కానీ, తమిళంలో ఈ తరహా సంప్రదాయం లేదు. అందుకే తన పేరులోని ‘రెడ్డి’ని సనంత్‌ తొలగించారు. ‘హార్టిన్‌’ మూవీని స్టెప్‌ వన్‌ స్టూడియోస్‌తో కలిసి ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఆర్‌.రవీంద్రన్‌ నిర్మించగా, కిషోర్‌కుమార్‌ దర్శకుడు. సనంత్‌, మడోన్నా సెబాస్టియన్‌, ఇమయ, వాట్సాప్‌ మణి, డెబ్‌నితకర్‌ తదితరులు నటించారు. ముకేష్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.


ఇదిలా ఉండగా గతంలో ‘డిమాంటి కాలనీ’, ‘పేట’, ‘మహాన్‌’ వంటి పలు చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలను పోషించిన సనంత్‌ హీరోగా నటించిన తొలి మూవీ ఇదే. ఈ మూవీని ముక్కోణపు ప్రేమ కథా చిత్రంగా దర్శకుడు రూపొందించారు. జైపూర్‌, చెన్నై, ఊటీలో చిత్రీకరణ పూర్తి చేశారు. ‘ప్రేమమ్‌’, ‘నేరమ్‌’ వంటి చిత్రాలకు సంగీతం సమకూర్చిన రాజేష్‌ మురుగేశన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇక సనంత్ విజ్ఞప్తిపై కోలీవుడ్‌లో రకరకాలుగా కామెంట్స్ పడుతున్నాయి. హీరోగా మొదటి సినిమాకే కండీషన్స్ పెడుతున్నాడంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌తో ఈ సినిమా‌పై చర్చలు నడుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Jana Nayagan: సీఎం అయినా విడుదల కాని సినిమా.. ఈసారి రెండు డేట్స్!

సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్.. ఆడు ‘పెద్ది’ సారొ!

‘బెంగ‌ళూరు నాగ‌ర‌త్త‌మ్మ’.. సింగీతం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చేదెవరో..

Updated Date - Jun 18 , 2026 | 10:24 AM