సూపర్ స్టార్ సినిమాలో డ్రాగన్ బ్యూటీ..
ABN, Publish Date - Jul 15 , 2026 | 08:10 PM
సప్తసాగరాలు దాటి సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ ఆడించింది కన్నడ సోయగం రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). అందం, అభినయం కలగలిపి అమ్మడు కుర్రకారు గుండెల్లో గూడు కట్టేసింది.
సప్తసాగరాలు దాటి సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ ఆడించింది కన్నడ సోయగం రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). అందం, అభినయం కలగలిపి అమ్మడు కుర్రకారు గుండెల్లో గూడు కట్టేసింది. ప్రస్తుతం రుక్మిణి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) సరసన సెన్సేషనల్ ప్రాజెక్ట్ డ్రాగన్ (Dragon) లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా తాజాగా అమ్మడు మరో లక్కీ ఛాన్స్ పట్టేసిందని టాక్ నడుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా చిత్రం ధర్మన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, కోలీవుడ్ వర్గాల నుండి ఒక ఆసక్తికరమైన రూమర్ గట్టిగా వినిపిస్తోంది. రుక్మిణి వసంత్ ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించబోతోందని సమాచారం.ఇప్పటికే ఈ సినిమాలో సిమ్రాన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరో కీలకపాత్ర కోసం రుక్మిణిని తీసుకున్నారట. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొందని టాక్ నడుస్తోంది. అంతటితో ఆగకుండా, ఈ చిత్రంలో స్టార్ కమెడియన్ యోగిబాబుతో కలిసి రుక్మిణి పలు హిలేరియస్ కామెడీ సీన్లలో నటించబోతోందని కోలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.
ఇదే కనుక నిజమైతే.. రుక్మిణి పంట పండినట్టే. సప్తసాగారాలు దాటి ఇచ్చిన జోష్ తో ఈ చిన్నది వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే తమిళ్ లో మదరాసి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. శివకార్తీకేయన్ హీరోగా ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత రుక్మిణి నటిస్తోన్న రెండో తమిళ్ మూవీ ధర్మన్. మరి ఈ సినిమాతో రుక్మిణి తమిళ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.