సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Renudesai: స్టార్స్ తో కలిసి.. కోలీవుడ్లోకి రీ ఎంట్రీ

ABN, Publish Date - Nov 11 , 2026 | 01:03 PM

  నటి రేణు దేశాయ్‌ (Renu Desai) 26 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నారు.

 
రేణు దేశాయ్‌ (Renu Desai) 26 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నారు. ధనుష్‌ (Dhanush) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓం: చాప్టర్‌ 1’ (Om: Chapter 1)తో ఆమె కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో తాను నటిస్తున్న విషయాన్ని రేణు దేశాయ్‌ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. దీంతో ఆమె పాత్రపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. మళ్లీ వెండితెరపై కనిపించబోతుండటం, ప్రేక్షకులను థియేటర్లలో కలుసుకోబోతుండటం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. 

రేణు దేశాయ్‌ చివరిసారిగా 2000లో ప్రభుదేవాతో కలిసి ‘జేమ్స్‌ పాండు’ చిత్రంలో తమిళ ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించిన ‘బద్రి’, ‘జానీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొంతకాలం నటనకు దూరంగా ఉన్న ఆమె.. 2023లో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించారు. ఇప్పుడు ‘ఓం: చాప్టర్‌ 1’తో మరోసారి తమిళ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు మలయాళ స్టార్‌ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్‌ షా, ఇంద్రన్స్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు ఒకే సినిమాలో కనిపించనుండటంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో రేణు దేశాయ్‌ ఎలాంటి పాత్రలో కనిపించనున్నారు? ఆమె పాత్ర కథలో ఎంత కీలకంగా ఉండనుంది? అనే వివరాలను చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. ఈ సినిమా నవంబర్‌ 20న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు. 26 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్‌ తమిళ చిత్రసీమలోకి తిరిగి వస్తుండటం, ధనుష్‌–మమ్ముట్టి వంటి అగ్ర నటులు కలిసి నటిస్తుండటంతో ‘ఓం: చాప్టర్‌ 1’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. 

Updated Date - Nov 11 , 2026 | 03:28 PM