సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అందరికీ రాపో స్వాగతం.. ధర్మన్ గట్టిగానే ప్లాన్ చేసిందిగా

ABN, Publish Date - Nov 08 , 2026 | 06:53 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా, ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan), ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ (RKFI) పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ధర్మన్ (Dharman).

Dharman

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా, ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan), ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ (RKFI) పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ధర్మన్ (Dharman). దర్శకుడు అశ్విత్ మారిముత్తు (Ashwath Marimuthu) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, నయనతార శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా కనిపించనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటి నుంచో ధర్మన్ సినిమాతో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా లీక్డ్ వీడియోస్ లో కూడా రజనీ, రామ్ కనిపించడంతో ఈ పుకార్లు నిజమే అని కన్ఫర్మ్ అయ్యింది.


తాజాగా దీపావళీ పండగ సందర్భంగా చిత్రబృందం రామ్ ని అధికారికంగా కోలీవుడ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అందరికీ రాపో స్వాగతం అంటూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ అనౌన్స్‌మెంట్ టీజర్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో రామ్ పోతినేని లుక్, స్టైలిష్ యాటిట్యూడ్ , ఎనర్జీ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. రామ్ పోతినేని పాత్ర కథను మలుపు తిప్పే విధంగా, అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని టాక్.


అందుతున్న సమాచారం ప్రకారం రజనీ- రామ్ మామ అల్లుళ్లుగా కనిపించనున్నారట. దీంతో ఈ సినిమాపై అటు తమిళ్ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తెలుగు, తమిళ భాషలతో పాటు పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. మొత్తానికి రజనీకాంత్ - కమల్ హాసన్ కలయికలో రాబోతున్న ఈ విజువల్ వండర్‌లో రామ్ పోతినేని ఎంట్రీ సినిమా స్థాయిని మరింత పెంచేసింది. మొత్తానికి ఈసారి ధర్మన్ గట్టిగానే కొట్టేలా అనిపిస్తోంది. మరి ఈ సినిమాతో రజనీ- రామ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Updated Date - Nov 08 , 2026 | 06:57 PM