పారితోషికం పెంచను.. నాకంటూ ఒక రోజు వస్తుంది: ఐశ్వర్య లక్ష్మి
ABN , Publish Date - Jun 24 , 2026 | 09:16 AM
వరుసగా హిట్ చిత్రాల్లో నటిస్తున్న మాలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మి తన పారితోషికాన్ని పెంచేందుకు నిరాకరించారు. అందుకు కారణం ఏంటో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
వరుసగా హిట్ చిత్రాల్లో నటిస్తున్న మాలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) తన పారితోషికాన్ని పెంచేందుకు నిరాకరించారు. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే పారితోషికం పెంచే నటీనటులు ఉన్న ఈ రోజుల్లో ఐశ్వర్య లక్ష్మి మాత్రం అందుకు అంగీకరించకపోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చెల్లా అయ్యావు దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘గట్టా కుస్తి-2’ (Gatta Kusthi 2)లో ఆమె హీరోయిన్‌గా నటించారు. జూలై 3న ఈ సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
‘‘పారితోషికం అనేది స్త్రీపురుషులకు సంబంధించిన విషయం కాదు. ఒక హీరో లేదా హీరోయిన్ ద్వారా ఎన్ని సినిమా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయన్నదే ముఖ్యం అని ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వెల్లడించారు. అయితే నేను నటించిన చిత్రాలు మంచి ప్రేక్షకాదారణ పొందిన సమయంలోనే పారితోషికం పెంచాలని కోరాను. కానీ, ఇపుడు నేను ఎవరితో పోల్చుకోవడం లేదు. అందువల్ల ఇపుడు నేను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం లేదు. నాకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజున మాత్రం ఖచ్చితంగా అడుగుతాను. ‘గట్టాకుస్తి’ తొలి భాగంలో విశ్రాంతికి ముందు వచ్చే ఫైట్ సన్నివేశం రూ.1.2 కోట్లతో చిత్రీకరించారు. షూటింగ్ సమయంలో ఆ సీన్‌ను నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, సినిమా విడుదలైన తర్వాత ఆ యాక్షన్ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేయడం చూసి ఆశ్చర్యపోయాను’’ అని పేర్కొన్నారు.
ఐశ్వర్య లక్ష్మి తెలుగులోనూ బిజీ నటిగా కొనసాగుతున్నారు. సత్యదేవ్ సరసన ఆమె నటించిన ‘గాడ్స్‌సే’ మూవీలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తోన్న ‘సంబరాల ఏటి గట్టు’ (Sambarala Yeti Gattu) చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి:
నారా లోకేష్‌తో తనని పోల్చగానే.. రామ్ చరణ్ ఏమన్నారంటే
నెట్‌ఫ్లిక్స్ ఊపిరి పీల్చుకో.. బాహుబలి టార్చ్‌బేరర్ వస్తున్నాడు!
పండంటి బిడ్డకు జననం.. నారా రోహిత్, శిరీష దంపతులకు ప్రమోషన్!