సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నా ఉనికికి ఆయ‌నే కార‌ణం.. రజనీ కోసం లారెన్స్ స్పెషల్ ప్లాన్!

ABN, Publish Date - Nov 06 , 2026 | 06:45 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదిన వేడుకలను ఈ నెల 12 నుంచి డిసెంబర్ 12 వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్నట్టు ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రకటించారు.

Raghava Lawrence

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 75 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ అందుకుని తన సత్తా చాటుకున్నారు తలైవా. ఈ నేపథ్యంలో ఆయన 76వ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల రోజుల పాటు రజనీ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) జన్మదిన వేడుకలను ఈ నెల 12 నుంచి డిసెంబర్ 12 వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్నట్టు ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ప్రకటించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేశారు. రజనీకాంత్ 75 యేళ్ల వయస్సులో ఇండస్ట్రీ హిట్ ఇవ్వడాన్ని చూసి వీరా భిమానిగా తానెంతో గర్వపడుతున్నానని, ఆ హిట్‌తో పాటు 76వ జన్మదినాన్ని కలిపి ఘనంగా జరుపుకోవాలని భావిస్తున్నానన్నారు.

రజనీ సమక్షంలో ఈ నెల రోజుల పండుగ జరపాలన్నది తన కోరికని, అయితే రజనీ ఇలాంటి ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తి కనుక అభిమానులతో కలిసి వేడుకలు జరుపనున్నామని చెప్పారు. చిన్నప్పటి నుంచి సూపర్ స్టార్‌ని నాయకుడిగా ఆరాధిస్తున్నానని, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉండటానికి, తనకు లభించిన కీర్తి ప్రతిష్ఠలకు ఆయనే కారణమని పేర్కొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 06:45 AM