లారెన్స్.. ఆ డేట్ న ఏం చెప్పబోతున్నాడు
ABN, Publish Date - Jun 07 , 2026 | 07:47 PM
కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) త్వరలో జరగబోయే ఎన్నికలలో సీఎం విజయ్ పార్టీ నుంచి తిరుచ్చి ఈస్ట్ (Trichy East) నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోన్న విషయం తెల్సిందే.
కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) త్వరలో జరగబోయే ఎన్నికలలో సీఎం విజయ్ పార్టీ నుంచి తిరుచ్చి ఈస్ట్ (Trichy East) నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోన్న విషయం తెల్సిందే. ఈ ఊహాగానాలపై క్లారిటీ ఇవ్వాలని అటు అభిమానులు, ఇటు మీడియా ప్రతినిధులు ఆయనను నిరంతరం సంప్రదిస్తున్నారట. దీంతో లారెన్స్ ఈ పుకార్లపై స్పందించాడు. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ లారెన్స్ స్వయంగా ఒక అధికారిక నోట్‌ను విడుదల చేశాడు. తన గురించి వస్తున్న వార్తలపై స్పందించాల్సిన బాధ్యత తనకు ఉందని తెలుపుతూనే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
'ప్రస్తుతం నేను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బెంజ్ సినిమా షూటింగ్‌లో ఎంతో బిజీగా ఉన్నాను. ఈ సినిమా షెడ్యూల్ జూన్ 10వ తేదీ వరకు కొనసాగుతుంది. అందుకే మీడియా మిత్రులను వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇవ్వలేకపోయాను. నా తల్లి ఆశీస్సులతో.. నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక నిర్ణయాన్ని జూన్ 11, గురువారం ఉదయం 9:30 గంటలకు అధికారికంగా ప్రకటించబోతున్నాను' అని తెలిపాడు.
ఇక ఆ రోజున లారెన్స్ ఏం చెప్పబోతున్నాడు అనేది మిస్టరీగా మారింది. నిజంగా లారెన్స్.. విజయ్ పార్టీలో చేరుతున్నాడా.. ?ఇంతకు మించిన పెద్ద వార్త ఏమై ఉంటుంది. ఒకవేళ తన కూతురు రాఘవిని డైరెక్టర్ గా పరిచయం చేయబోతున్నాడా.. ? లేక ఏదైనా సినిమా ప్రకటన చేయబోతున్నాడా.. ? అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. మరి లారెన్స్ ఏం చెప్పబోతున్నాడో తెలియాలంటే జూన్ 11 వరకు ఆగాల్సిందే.