మొన్న కయాదు.. నేడు మమితా.. సోషల్ మీడియాకి బ్రేక్
ABN, Publish Date - Jul 07 , 2026 | 05:04 PM
ఈ రోజుల్లో సినిమా సెలబ్రిటీలకు, ముఖ్యంగా హీరోయిన్లకు సోషల్ మీడియా అనేది ఒక పెద్ద వరం. సినిమా ప్రమోషన్స్ నుంచి పర్సనల్ ఫోటో షూట్స్ వరకు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండటానికి ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికలను విపరీతంగా వాడుతుంటారు.
ఈ రోజుల్లో సినిమా సెలబ్రిటీలకు, ముఖ్యంగా హీరోయిన్లకు సోషల్ మీడియా అనేది ఒక పెద్ద వరం. సినిమా ప్రమోషన్స్ నుంచి పర్సనల్ ఫోటో షూట్స్ వరకు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండటానికి ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికలను విపరీతంగా వాడుతుంటారు. అయితే, నాణేనికి రెండో వైపు ఉన్నట్లు.. అదే సోషల్ మీడియా ఇప్పుడు హీరోయిన్లకు పెద్ద శాపంగా మారుతోంది. మితిమీరిన ట్రోలింగ్, నెగెటివిటీ, వ్యక్తిగత జీవితంపై వచ్చే రూమర్స్ భరించలేక చాలామంది భామలు డిజిటల్ డిటాక్స్ బాట పడుతున్నారు. మొన్నటికి మొన్న యంగ్ బ్యూటీ కయాదు లోహర్ (Kayadu Lohar) సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వగా.. ఇప్పుడు అదే బాటలో క్రేజీ హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju) కూడా నడవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రేమలు సినిమాతో సౌత్ ఇండియాలోనే ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిన మమితా బైజు ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో ఆమెకు భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక నిన్ననే ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తోన్న చిత్రంలో మమితానే లీడ్ హీరోయిన్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ సమయంలో మమితా సోషల్ మీడియాకి బ్రేక్ చెప్పడం సంచలనంగా మారింది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉంటూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న అకౌంట్లను పక్కన పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. ' నా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటికీ కొన్నిరోజులు నేను దూరంగా ఉంటున్నాను. నాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ మా టీమ్ కవర్ చేస్తోంది' అని చెప్పుకొచ్చింది. అయితే మమితా ఇలా సడెన్ గా డిజిటల్ డిటాక్స్ బాట పట్టడం వెనుక రీజన్ ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
సెలబ్రిటీలు ఇలా ఉన్నట్టుండి సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలువురు స్టార్ హీరోయిన్లు డిప్రెషన్ లేదా పర్సనల్ స్పేస్ కోసం అకౌంట్లను డీయాక్టివేట్ చేశారు. మొన్న కయాదు.. నేడు మమితా బైజు తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మానసిక ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని, వారు తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ కొందరు సపోర్ట్ చేస్తుంటే.. అసలు వీరు సోషల్ మీడియాకు దూరం కావడానికి వెనుక ఉన్న బలమైన కారణం ఏంటో తెలుసుకోవాలని మరికొందరు ఆరాటపడుతున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుందో చూడాలి.