సత్యం సుందరం.. ఆ స్టార్స్ కోసమే రాశాను
ABN , Publish Date - Oct 10 , 2026 | 08:35 PM
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, అగ్ర హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రల్లో నటించి ఘనవిజయం సాధించిన రొమాంటిక్ కల్ట్ క్లాసిక్ చిత్రం 96. దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో జాను పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే.
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి (Vijay sethupathi), అగ్ర హీరోయిన్ త్రిష (Trisha) ప్రధాన పాత్రల్లో నటించి ఘనవిజయం సాధించిన రొమాంటిక్ కల్ట్ క్లాసిక్ చిత్రం 96. దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో జాను పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో శర్వానంద్, సమంత నటించిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. 96 సినిమాలో మొదట జాను పాత్ర కోసం మొదట నటి జ్యోతికను సంప్రదించారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ వదంతులపై దర్శకుడు ప్రేమ్‌కుమార్ స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చారు.
'మొదటి నుంచి జాను పాత్రకు త్రిషనే అనుకున్నాను. అయితే అప్పట్లో త్రిష వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు కాలేదు. ఆ సమయంలో వేరే హీరోయిన్‌ను తీసుకోవాలని ఒత్తిడి కూడా తెచ్చారు. కానీ, చివరకు త్రిష తన షెడ్యూల్‌ను మార్చుకుని డేట్స్ కేటాయించడంతో 96 పట్టాలెక్కింది. నేను స్క్రిప్ట్ రాసేటప్పుడే పాత్రలకు సరిపడే నటీనటులను మనసులో ఊహించుకుంటాను. ఈ సినిమాకి విజయ్ - త్రిషలను మైండ్‌లో ఫిక్స్ చేసుకున్నాను' అని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమా తరువాత ఆయన తెరకెక్కించిన చిత్రం మెయ్యళగన్. తెలుగులో సత్యం సుందరంగా రిలీజ్ అయ్యింది. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కోసం ప్రేమ్ కుమార్ మొదట రజనీకాంత్, కమల్ హాసన్ ని అనుకున్నాడట. వారిని ఊహించుకొనే ఈ కథను రాసినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. సినిమా విడుదలై ఇన్ని సంవత్సరాలు గడిచినా ప్రేక్షకులు ఇంకా తన సినిమాపై ఆ ప్రేమను కురిపిస్తుండటం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. అంతేకాకుండా కథలే తనను నడిపిస్తాయని, కొన్నిసార్లు కథలు వచ్చినా అవి పట్టాలెక్కవని చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా సత్యం సుందరం కనుక రజనీ, కమల్ చేసి ఉంటే మాత్రం వేరే లెవెల్ లో ఉండేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.