సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jailer 2: ఏమయ్యా నెల్సన్.. మళ్లీ మోసం చేశావా

ABN, Publish Date - Nov 13 , 2026 | 08:28 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ 2 (Jailer 2) సినిమా ఈ ఏడాది ఏ రేంజ్ లో రచ్చ రేపిందో అందరికీ తెల్సిందే.

Jailer 2

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ 2 (Jailer 2) సినిమా ఈ ఏడాది ఏ రేంజ్ లో రచ్చ రేపిందో అందరికీ తెల్సిందే. తెలుగు పెద్ద సినిమాలని పక్కకు నెట్టి మరీ జైలర్ 2 రికార్డులు సృష్టించింది. మరోసారి రజనీకాంత్ స్టామినా ఎంతో ఇప్పటి జనరేషన్ కి రుజువు చేసింది. కథ అంతగా లేకపోయినా ఎలివేషన్స్, మ్యూజిక్ తోనే మ్యాజిక్ చేసి రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్ తో పాటు ఈ సీక్వెల్ లో హృతిక్ రోషన్ క్యామియో నెక్స్ట్ లెవెల్ హైప్ ని తీసుకొచ్చిపెట్టింది. ఇక థియేటర్ లో విజయవంతంగా కొనసాగిన జైలర్ 2 ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.


అయితే జైలర్ 2 రిలీజ్ సమయంలో ఈ సినిమా నుంచి పలు కీలక సన్నివేశాలను తొలగించారంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ముఖ్యంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కోలీవుడ్ స్టార్ కమెడియన్ క్యూట్ యాక్టర్ సంతానం నటించిన కొన్ని ముఖ్యమైన సీన్లను ఎడిటింగ్ లో లేపేశారంటూ రిలీజ్ సమయంలో భారీ వివాదాలు, విమర్శలు కూడా తలెత్తాయి. థియేటర్‌లో రన్ టైమ్ కంట్రోల్ చేయడానికి ఆ సన్నివేశాలను పక్కన పెట్టారని, కానీ సినిమా ఓటీటీలోకి వచ్చేటప్పుడు ఆ డిలీటెడ్ సీన్స్ అన్నీ కలిపి అన్‌కట్ లేదా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేస్తారని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, ఓటీటీలో విడుదలైన జైలర్ 2 వెర్షన్‌ను పరిశీలిస్తే.. థియేటర్లలో ఏ వెర్షన్ అయితే చూశారో, సేమ్ అదే వెర్షన్‌ను ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేశారు. మోహన్‌లాల్, సంతానంలకు సంబంధించిన ఆ తొలగించిన సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో కూడా యాడ్ చేయకపోవడం విశేషం.


దీంతో ఆయా స్టార్ హీరోల అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సినిమాకు మరింత హైప్ తెచ్చే ఆ సీన్లను ఓటీటీలో అయినా చూడొచ్చని ఆశించిన వారికి మేకర్స్ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ రాలేదు. భవిష్యత్తులో మేకర్స్ ఆ డిలీటెడ్ సీన్స్‌ను ప్రత్యేకంగా సోషల్ మీడియాలో విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి. ఏదేమైనా జైలర్ 2 ఓటీటీ రిలీజ్ మాత్రం డిలీటెడ్ సీన్స్ విషయంలో ఫ్యాన్స్‌కు కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌ మిగిల్చింది. దీంతో.. ఇక్కడ కూడా మోసం చేశావా నెల్సన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోపక్క థియేటర్ లో జైలర్ 2 చూసినవారు ఆ మ్యూజిక్ కి హైప్ తెచ్చుకున్నామని, కానీ ఓటీటీలో అలాంటి హైప్ లేదని చెప్పుకొస్తున్నారు. కొత్తగా జైలర్ 2 చూసినవారు.. ఎలారా ఇంత హైప్ అయ్యారు ఈ సినిమాకి అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు జైలర్ 2 ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Nov 13 , 2026 | 08:33 PM