సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మహా శక్తి టీజర్.. అమ్మవారిగా నయనతార

ABN, Publish Date - Sep 14 , 2026 | 11:30 AM

సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార- దర్శకుడు సుందర్ సి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత భారీ ఎపిక్ డివైన్ ఫాంటసీ చిత్రం మహా శక్తి.

Maha Sakthi

సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara)- దర్శకుడు సుందర్ సి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత భారీ ఎపిక్ డివైన్ ఫాంటసీ చిత్రం మహా శక్తి (Maha Sakthi ). గతంలో నయనతార నటించిన మూకుత్తి అమ్మన్ .. తెలుగులో అమ్మోరు తల్లి సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొదటి సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా.. కొన్ని కారణాల వలన సీక్వెల్ కి ఆయన కాకుండా సుందర్ సి ఆ భాద్యతలను అందుకున్నాడు. ఇక చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్రఖ్యాత నిర్మాత డాక్టర్ ఇషారీ కె. గణేష్ దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తోన్నయాడు. ఈ ప్రాజెక్ట్‌పై ప్రారంభం నుంచే తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ టీజర్ రైజ్ ఆఫ్ మహాశక్తిని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.


విడుదలైన ఈ టీజర్ విజువల్స్ పరంగా ఎంతో హార్రర్, డివైన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో మైండ్ బ్లాకింగ్ విజువల్ వండర్‌లా ఉంది. చెడు శక్తుల భయంతో, అన్యాయంతో అల్లకల్లోలమవుతున్న గ్రామాన్ని, ప్రజలను రక్షించడానికి అమ్మవారిని వేడుకోవడం, ఆ తర్వాత దైవిక శక్తిగా నయనతార ఉగ్ర రూపంతో అడుగుపెట్టడం టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నయనతార త్రిశూలం పట్టుకుని పవర్‌ఫుల్ అమ్మవారి రూపంలో కనిపించిన తీరు, ఆ ప్రశాంతత రౌద్రం కలగలిపిన హావభావాలు అభిమానులను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి.


హిప్‌హాప్ తమిళ అందించిన మైండ్ బ్లాకింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ డివైన్ థ్రిల్లర్ మూడ్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. మొదటి పార్ట్ తో పోల్చుకుంటే ఈసారి గ్రాండ్ స్కేల్‌లో, గ్రాఫిక్స్, భారీ సెట్లతో ఈ చిత్రాన్ని రూపుదిద్దుకున్నట్లు టీజర్ చూస్తుంటే అర్ధమవుతోంది. అమ్మవారి పాత్రలో జీవించడం కోసం నయనతార ప్రత్యేకంగా నెల రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్ష కూడా చేపట్టడం విశేషం. ఇక ఈ చిత్రంలో విలన్‌గా రెజినా కాసాండ్రా నటిస్తుండగా.. దునియా విజయ్, యోగి బాబు, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో మహా శక్తి టైటిల్‌తో అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయనడంలో సందేహం లేదు. మరి ఈ చిత్రంతో నయన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Sep 14 , 2026 | 11:31 AM