సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

భాగ్యరాజ్ చివరి చిత్రం.. హాయ్ ట్రైలర్ రిలీజ్

ABN, Publish Date - Aug 21 , 2026 | 03:54 PM

లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara), తమిళ నటుడు కవిన్ (Kavin) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హాయ్ (Hi).

Hi

లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara), తమిళ నటుడు కవిన్ (Kavin) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హాయ్ (Hi). విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామాను విఘ్నేష్ శివన్, నయనతార, ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా హాయ్ తెలుగు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లెజెండరీ నటుడు భాగ్యరాజ్ నటించిన చివరి చిత్రం ఇదే కావడంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


ఈ ట్రైలర్‌లో 'మగాడి జీవితం మూడు రకాలు.. ఒకటి ప్రేమించి పెళ్లి చేసుకోవటం, రెండు పెళ్లి చేసుకున్నాక ప్రేమించటం, మూడు అటు ప్రేమించలేక ఇటు పెళ్లి గాక బేవరసగా తిరగడం అంటూ భాగ్యరాజ్ తిట్టే సీన్ తో మొదలైంది. విష్ణుకు చిన్నతనం నుంచి అమ్మాయిల ప్రేమ దక్కడు. స్కూల్ నుంచి జాబ్ వరకు ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసినా అతనిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. దీంతో అతను ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇక ఆ సమయంలోనే అతడి జీవితంలోకి దేవసేన వస్తుంది. కేవలం ఫ్రెండ్స్ గా కూడా లేని వారిద్దరికీ అనుకోకుండా కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తారు. అసలు ఈ దేవసేన ఎవరు.. ? విష్ణు జీవితంలోకి ఎందుకు వచ్చింది.. ? ఆమె వచ్చాక విష్ణు జీవితం ఎలా మారింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


వినోదం, సెంటిమెంట్. లవ్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సినిమా రూపుదిద్దుకుందని ట్రైలర్ ని బట్టి చెప్పొచ్చు. ముఖ్యంగా కవిన్ - నయన్ సీన్స్ చాలా బావున్నాయని టాక్ నడుస్తోంది. జెన్ మార్టిన్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంది. ట్రైలర్ లో భాగ్యరాజ్ సీన్స్ అద్బుతంగా ఉన్నాయి. ఆయనే ఈ సినిమాకు ప్రధానకర్షణ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సినిమాతో నయన్.. నిర్మాతగా, నటిగా హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Updated Date - Aug 21 , 2026 | 03:54 PM