తాళి మహిళలే ఎందుకు వేసుకోవాలి.. నమిత సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Sep 11 , 2026 | 09:30 PM
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా అలరించి, తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న నటి నమిత ఈమధ్య ఇంటర్వ్యూలలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా అలరించి, తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న నటి నమిత (Namitha) ఈమధ్య ఇంటర్వ్యూలలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తాజాగా ఆమె వివాహ వ్యవస్థలో సమానత్వంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. పెళ్లి తర్వాత పాటించాల్సిన సంప్రదాయాలు, నియమాలు కేవలం మహిళలపైనే రుద్దడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సమాజంలో మగవారికి లేని నిబంధనలు, ఆంక్షలు ఒక్క స్త్రీలకే ఎందుకు వర్తిస్తాయని ఆమె ప్రశ్నించడం కలకలం రేపింది.
తాళి బొట్టు ధరించడం అనే సంప్రదాయంపై నమిత ప్రత్యేకంగా స్పందిస్తూ.. వివాహానికి గుర్తుగా స్త్రీలు మాత్రమే తాళి ఎందుకు వేసుకోవాలని నిలదీసింది. పురుషులు కూడా తాళి బొట్టు లేదా పెళ్లయిందనడానికి ఏదైనా గుర్తింపును ఎందుకు ధరించకూడదని ప్రశ్నించింది. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల సమాన భాగస్వామ్యమని, కానీ సంప్రదాయాల పేరుతో పాటించే నియమాలు మాత్రం ఏకపక్షంగా ఒక్క మహిళలపైనే ఉండటం సరైనది కాదని అభిప్రాయపడింది.
నమిత చేసిన ఈ సంచలన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ, మారుతున్న కాలానికి అనుగుణంగా లింగ సమానత్వం వైపు ఆలోచించాలని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయాలను, సంస్కృతిని విమర్శించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.