హీరోగా.. భరణి కుమారుడు! షూటింగ్ స్టార్ట్
ABN, Publish Date - Nov 22 , 2026 | 10:46 AM
ప్రముఖ సంగీత దర్శకుడు భరణి కుమారుడు తిరువాసగన్ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు భరణి (Bharani) కుమారుడు తిరువాసగన్ (Thiruvasagan) వెండితెరకు హీరోగా పరిచయమవుతున్నారు. స్టైల్ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దర్శకుడు రామ్ సేవ (Ram Seva) రచన, కథ స్క్రీన్ ప్లే సమకూర్చి దర్శకత్వం వహించే 'ప్రొడక్షన్ నెం.1' చిత్ర పూజా కార్యక్రమం స్థానిక పోరూర్‌లోని ఓం శ్రీ అంకాళపరమేశ్వరి ఆలయంలో జరిగింది. ఈ చిత్రం ప్రస్తుతం యువత జీవితాలు, సమకాలీన సమాజంలో జరుగుతున్న పెద్ద రహస్యం నేపథ్యంలో ప్రేమ, కుటుంబ అనురాగం, ఉత్కంఠభరితమైన మలుపులతో నిండిన ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.
అనేక విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు భరణి ఈ చిత్రానికి సంగీత స్వరాలను సమకూర్చుతున్నారు. తిరువాసగన్ తోపాటు డాక్టర్ శరవణన్ సినిమా కథను ముందుకు నడిపించే చాలా ముఖ్యమైన, శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే, పలువురు యంగ్ టాలెంట్‌కు ఇందులో అవకాశం కల్పించారు. చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేయనున్నారు.