వాస్తవ ఘటనల ఆధారంగా మెడికల్ క్రైమ్ థ్రిల్లర్.. ఈ నెల 27న 'నిరమ్' రిలీజ్!
ABN, Publish Date - Nov 24 , 2026 | 09:18 AM
ముగేన్ రావ్, ప్రీతి ఆస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ 'నిరమ్' ఈ నెల 27న విడుదల కానుంది.
వైద్య రంగంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా ఉత్కంఠ భరితమైన కథాంశంతో మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన నిరమ్ (Niram) ఈ నెల 27న విడుదలకానుంది. ముగేన్ రావ్ (Mugen Rao), ప్రీతి ఆస్రాని (Preethi Asrani), తాన్య హోప్ హీరో హీరోయిన్లుగా నటించగా, నితిన్ సత్య, సురేఖ వాణి, శ్రీజిత్ రవి, అన్బు మైల్సామి, తిరునావుక్కరసు, గజరాజ్, స్నేహ గుప్తా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
బలరామ్ కృష్ణ (Balaram Krishna) దర్శకత్వం వహించగా, కె. స్క్వేర్ సినిమాస్ పతాకంపై కె.బిందు మాధవి నిర్మించారు. వైద్య రంగంలోని ముఖ్యమైన అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అభిమానులలో సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల ఎదుటకు రానుంది.