Sundar C: నిజాలు తెలుసుకోకుండా.. వార్తలు రాయడం బాధిస్తుంది
ABN, Publish Date - Nov 03 , 2026 | 10:00 AM
మూక్కుత్తి అమ్మన్ 2 సినిమా గురించి దర్శకుడు సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం, ఒకరిపై తప్పుగా మాట్లాడటం చాలా బాధిస్తుందని ప్రముఖ దర్శకుడు సుందర్ సి (Sundar C) అన్నారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం మూక్కుత్తి అమ్మన్-2 (Mookuthi Amman 2). దీపావళి కానుకగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 'విమర్శలకు నేను ఎప్పుడూ బాధ పడలేదు. కానీ, నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం, వ్యాఖ్యలు చేయడం నన్ను ఎంతగానో బాధించాయి. అలాగే, సాధారణంగా నటీనటుల కోసం సినిమాలు చేయను. నాకు ఒక ఆలోచన వస్తుంది. దాన్ని మెరుగుపరిచి, కథకు సరిపోయే నటీన టులతో సినిమా తీస్తాను. అలాంటి ఆలోచనతోనే రూపుదిద్దుకున్నది అమ్మన్ చిత్రం.
ఇక 'మూక్కుత్తి అమ్మన్' సినిమా విషయానికొస్తే కోలీవుడ్‌కు చెందిన అనేక మంది సాంకేతిక కళాకారుల కఠోర శ్రమతో గ్రాఫిక్స్ సన్నివేశాలు సృష్టించడం జరిగింది. వాటిని చూసి బాగుంటే ప్రశంసించండి. తప్పుగా ఉంటే సూచనలు ఇవ్వండి. వాటిని సరిదిద్దుకుంటాం అన్నారు.
ఇందులో మూడు వేలకు పైగా గ్రాఫిక్స్ ఉన్నాయి. కృత్రిమ మేథ కూడా వినియోగించాం. ఈ సినిమా హీరోయిన్ చుట్టూ కేంద్రీకృతమైనది. నయనతార (Nayanthara) హీరోయిన్ రెజీనా (Regina Cassandra) విలన్‌గా నటించారు. ఈ చిత్రానికి హీరోలు అంటే దీనికి కోసం పనిచేసిన 800 మంది ఉన్నారు. వారు ఎంతగానో కృషి చేశారు' అని పేర్కొన్నారు.