సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కాళికాదేవి ఆలయంలో నయనతార పూజలు

ABN, Publish Date - Nov 05 , 2026 | 07:36 AM

మూక్కుత్తి అమ్మన్ 2 విడుదలకు ముందు నటి నయనతార చెన్నైలోని కాళికాంబాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు.

Nayanthara

ప్రముఖ నటి నయనతార (Nayanthara) మరోసారి సంప్రదాయబద్ధమైన లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. చెన్నైలోని ప్రసిద్ధ కాళికాంబాల్ (Kalikambal Temple) ఆలయాన్ని సందర్శించిన ఆమె.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టుచీర, ముక్కుపుడక, పెద్ద జుంకాలు ధరించి అచ్చమైన సంప్రదాయ రూపంలో దర్శనమిచ్చారు. ఆలయంలో ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన నయనతార ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చెన్నై ప్యారీస్ ప్రాంతంలోని తంబుశెట్టి వీధిలో ఉన్న కాళికాంబాల్ ఆలయానికి నయనతార మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. సాధారణంగా సినిమా షూటింగులు, ప్రమోషన్లతో బిజీగా ఉండే నయనతార.. ఆలయంలో మాత్రం ఎంతో ప్రశాంతంగా కనిపించారు. సంప్రదాయ దుస్తుల్లో ఆమె అందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అంతేకాదు.. ఆలయానికి వచ్చిన మహిళలకు నయనతార చీరలు, జాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. దీంతో ఆమె అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. భక్తితో పాటు సేవా భావాన్ని చాటుకున్నారంటూ ప్రశంసిస్తున్నారు.

మరోవైపు నయనతార తన తాజా చిత్రం మూక్కుత్తి అమ్మన్ 2 (Mookuthi Amman 2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో మ‌హా శ‌క్తిగా విడుద‌ల అవుతోంది. గతంలో వచ్చిన 'మూక్కుత్తి అమ్మన్' చిత్రంలో అమ్మవారి పాత్రలో నటించి మెప్పించిన ఆమె.. ఇప్పుడు సీక్వెల్‌లోనూ అదే తరహా పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల 6న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నయనతార ఆలయాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - Nov 05 , 2026 | 07:38 AM