నానిలా నేను కూడా గొడవకి దిగుతా.. మొదరాత్రి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Oct 02 , 2026 | 03:43 PM
కొన్ని సినిమాలు థియేటర్ లో నచ్చవు. అవే సినిమాలు ఓటీటీలోనో.. టీవిలోనో చూసి అబ్బా ఏం సినిమారా.. ఎలారా ప్లాప్ చేశారు అని చెప్పుకోస్తారు. అలాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలలో అంటే సుందరానికి ఒకటి.
కొన్ని సినిమాలు థియేటర్ లో నచ్చవు. అవే సినిమాలు ఓటీటీలోనో.. టీవిలోనో చూసి అబ్బా ఏం సినిమారా.. ఎలారా ప్లాప్ చేశారు అని చెప్పుకోస్తారు. అలాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలలో అంటే సుందరానికి (Ante Sundaraniki) ఒకటి. న్యాచురల్ స్టార్ నాని (Nani), నజ్రియా (Nazriya) జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ, ఈ సినిమా ప్లాప్ అంటే టేస్ట్ ఉన్న ఎవరూ ఒప్పుకోరు అని నాని డైరెక్ట్ గా చెప్పాడు. ఎవరైనా ఈ సినిమా బాలేదు అంటే వారితో గొడవ పడడానికి కూడా వెనుకాడను అని చెప్పుకొచ్చాడు. తాజాగా తమిళ దర్శకుడు రాజా కరుప్పసామి సైతం అలాగే స్పందించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా బాగున్నా ప్లాప్ చేశారని రాజా చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది విడుదలై చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి అనూహ్య విజయాన్ని సాధించిన చిత్రం మొదరాత్రి. ఆ చిత్ర దర్శకుడు రాజా కరుప్పసామి, వివేక్ ఆత్రేయపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివేక్ ఆత్రేయపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'నేను కూడా హీరో నాని సర్ లాగే నిలబడతాను.. ఎవరైనా అంటే సుందరానికి సినిమా బాగోలేదని అంటే వారితో కొట్లాటానికైనా సిద్ధమే. అది ఎంతో మంచి సినిమా. వివేక్ ఆ చిత్రాన్ని చూపించిన విధానం చాలా బావుంటుంది. అదొక్కటే కాదు.. ఆయన తెరకెక్కించిన బ్రోచేవారెవరురా కూడా నాకు చాలా బాగా నచ్చింది. నా దృష్టిలో సరిపోదా శనివారం సినిమా హాలీవుడ్ పాపులర్ సూపర్ హీరో బ్యాట్‌మ్యాన్ వర్షన్ లాంటిది. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగానికి లభించిన అగ్రశ్రేణి స్క్రీన్‌రైటర్లలో, అత్యుత్తమ దర్శకుల్లో వివేక్ ఆత్రేయ ఒకరు" అని రాజా కరుప్పసామి ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక తమిళ డైరెక్టర్.. తెలుగు డైరెక్టర్ పై ఈ రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపిస్తుంటే నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రిషికాంత్, అనిష్మా అనిల్ కుమార్ ముఖ్య పాత్రల్లో గ్రామీణ నేపథ్యంతో వచ్చిన కామెడీ-డ్రామా మొదరాత్రి థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్న సినిమా, ఓటీటీలో సంచలనం సృష్టిస్తూ నాన్-ఇంగ్లీష్ గ్లోబల్ టాప్-10 చార్ట్స్‌లో ఏకంగా రెండో స్థానానికి చేరుకుని మిలియన్ల వ్యూస్‌తో గ్లోబల్ స్థాయిలో దుమ్మురేపుతోంది.