ఒరేయ్.. కరుప్పులో ఇన్ని సినిమాల రిఫరెన్సులు ఉన్నాయా
ABN, Publish Date - Jun 13 , 2026 | 04:23 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) హీరోగా ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కరుప్పు(Karuppu). డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ విలన్ గా నటించగా.. త్రిష కృష్ణన్ (Trisha Krishnan) హీరోయిన్ గా కనిపించింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) హీరోగా ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కరుప్పు(Karuppu). డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ విలన్ గా నటించగా.. త్రిష కృష్ణన్ (Trisha Krishnan) హీరోయిన్ గా కనిపించింది. ఎన్నో అంచనాల నడుమ కరుప్పు మే 15 న రిలీజ్ అయ్యింది. ఈ సినిమానే తెలుగులో వీరభద్రుడు (Veerabhadrudu) అనే పేరుతో రిలీజ్ అయ్యింది. తెలుగులో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. తమిళ్ లో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా సూర్య ఫ్యాన్స్ కి ఇది విందు భోజనంలా మారింది. సూర్య స్టైలిష్ లుక్ తో పాటు కరుప్పు సామీగా కనిపించడంతో తమిళ్ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. న్యాయవ్యవస్థలోని అవినీతిపై పోరాడటానికి, సంరక్షక దైవమైన కరప్పు సామీనే దిగి రావడం.. ఆయన మహిమలతో విలన్ ని ఆట ఆడించడం ప్రేక్షకులకు బాగా నచ్చాయి.
ఇక తాజాగా కరుప్పు ఓటీటీ బాట పట్టింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక థియేటర్ లో చూడని అభిమానులు ఓటీటీలో చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను చెప్తున్నారు. అంతేకాకుండా హిడెన్ డీటైల్స్ ను కూడా గమనించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో ప్రతి సినిమాలో స్టార్ హీరోల రిఫరెన్స్.. పాత సినిమాల రిఫరెన్స్ లు పెట్టడం డైరెక్టర్స్ కి ట్రెండ్ గా మారిపోయింది. ఇక ప్రేక్షకులు కూడా ఆ రిఫరెన్స్ లను ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటి రెండు అయితే ఓకే కానీ.. కరుప్పులో ఆర్జే బాలాజీ ఏకంగా అరడజను కి పైగా స్టార్ హీరోల సినిమాల రిఫరెన్సులు వాడేశాడు. అందులో తన సినిమాలు, సూర్య సినిమాలు కూడా ఉన్నాయి.
ప్రభాస్ బాహుబలి.. సప్త సాగరాలు దాటి, విజయ్ పోకిరి, లియో.. సూర్య యువ, జై భీమ్, 24, నువ్వు నేను ప్రేమ, సింగం, ఎన్.జి.కె... రజనీకాంత్ బాషా.. ఆర్జే బాలాజీ అమ్మోరు తల్లి, ఎల్.కె.జి. లాంటి సినిమాల్లోని ఐకానిక్ డైలాగ్స్ ని, హీరోల బాడీ లాంగ్వేజ్ ని సూర్య చేత రీక్రియేట్ చేయించాడు. థియేటర్ లో ఇవేమీ ప్రేక్షకులు గమనించలేదు. కానీ, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక కొంతమంది ఈ హిడెన్ డీటైల్స్ ను గమనించి.. ఈ రిఫరెన్స్ లను వెతికి తీస్తున్నారు. ఇక ఈ రిఫరెన్స్ లు చూసి ప్రేక్షకులు నోళ్ళు వెళ్ళబెడుతున్నారు. ఒరేయ్.. ఇన్ని సినిమాల రిఫరెన్సులు ఉన్నాయా..? దేవుడా.. ఆర్జే బాలాజీ మామూలోడు కాదు అని కొందరు.. అంతా సినిమా పిచ్చి ఏంటి బ్రో అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.