సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కన్నీళ్ళు పెట్టిస్తోన్న భారతీరాజా చివరి వీడియో..

ABN, Publish Date - Jun 10 , 2026 | 03:27 PM

తమిళ, తెలుగు చిత్రసీమలో ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) మరణవార్త సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వార్త తెలుసుకున్న స్టార్స్ అందరూ ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు.

Bharathiraja

తమిళ, తెలుగు చిత్రసీమలో ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) మరణవార్త సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వార్త తెలుసుకున్న స్టార్స్ అందరూ ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. భారతీరాజా తెరకెక్కించిన సినిమాల గురించి, ఆయన టేకింగ్, ఆలోచనా విధానం గురించి ఎంతో గొప్పగా చెప్పుకొస్తున్నారు. తాజాగా భారతీరాజా చివరి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్.. తాయ్ కిళవి సినిమా రిలీజ్ అయ్యాక భారతీరాజాను కలిసి మాట్లాడిన వీడియో ప్రస్తుతం మరోసారి వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో భారతీరాజా కనిపించిన చివరి వీడియో ఇదే.


1978లో భారతీరాజా దర్శకత్వం వహించిన కిజక్కే పోగుమ్ రైల్ సినిమాతో రాధిక ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆయనే ఆమెకు ఆరాధ్య గురువు. కొన్నిరోజుల క్రితం భారతీరాజా అనారోగ్యం గురించి తెలుసుకున్న రాధికా ఆయనను కలిసి పరామర్శించారు. ఇక ఆ సమయంలోనే ఆమె నటించిన తాయ్ కిళవి సినిమాపై ప్రశంసలు కురిపించారు. ' సినిమా చాలా బావుంది.. నీకు ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది' అని ఆశీర్వదించారు. దానికి రాధిక ఎంతో ఎమోషనల్ అవుతూ.. 'ఒకవేళ అవార్డు వస్తే దాన్ని మీ పాదాల చెంత ఉంచి మీ ఆశీస్సులు తీసుకుంటాను' అని చెప్పారు.


ఇక రాధిక- భారతీరాజా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ గురు-శిష్యుల ఆఖరి సంభాషణ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. వీల్ చైర్ లో లెజెండరీ డైరెక్టర్ ను చూసి అభిమానులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎంతోమంది నటీనటులను ఒక్క మాటతోనే కంట్రోల్ చేసిన దర్శకుడు.. చివరి క్షణాల్లో మాటలు రాక ఇబ్బందిపడుతుంటే కంటనీరు ఆగడం లేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 03:55 PM