సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అప్పట్లో జయలలిత కొడుకు పెళ్లి.. ఇప్పుడు కావ్య మారన్ పెళ్లి

ABN, Publish Date - Nov 25 , 2026 | 07:53 PM

సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం గ్రీస్‌లో ఘనంగా జరిగింది. అనంతరం చెన్నైలో సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖుల కోసం ప్రత్యేక విందులు నిర్వహించడంతో పాటు సన్ నెట్‌వర్క్ ఉద్యోగులకు కూడా భారీ విందు ఏర్పాటు చేశారు.

Anirudh Ravichander

తమిళనాడు చరిత్రలో అత్యంత వైభవంగా జరిగిన వివాహాల ప్రస్తావన వస్తే మొదట గుర్తుకొచ్చేది 1995లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa) తన దత్తపుత్రుడు సుధాకరన్‌కు చేసిన పెళ్లి. చెన్నైలో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో, 1.50 లక్షల మందికి పైగా అతిథులతో, కిలోమీటర్ల కొద్దీ గులాబీ రేకులు, వెలుగు జిలుగుల అలంకరణలు, ఏఆర్ రెహమాన్ కచేరీలతో జరిగిన ఆ వేడుక ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అప్పట్లో మదర్ ఆఫ్ ఆల్ వెడ్డింగ్స్ గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ వివాహం తర్వాత, ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల అనంతరం తమిళనాట మళ్లీ ఆ స్థాయి గ్రాండ్ సెలబ్రేషన్స్ కనిపించాయి. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ (Kalanithi Maran) తన కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ (Kavya Maran) వివాహాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) తో కనీవినీ ఎరుగని రీతిలో జరిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.


నవంబర్ 11న గ్రీస్ దేశంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా కావ్య మారన్ - అనిరుధ్ వివాహం వైభవంగా జరిగింది. ఆ తర్వాత చెన్నై వేదికగా కళానిధి మారన్ వరుసగా ఏర్పాటు చేసిన విందులు, రిసెప్షన్లు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారాయి. చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళలో జరిగిన వేడుకల్లో ఒకరోజు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీల కోసం ప్రత్యేక రిసెప్షన్ నిర్వహించగా.. ముఖ్యమంత్రి విజయ్, ఎంకే స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి, రజనీకాంత్, కమల్ హాసన్, రేవంత్ రెడ్డి, నారా లోకేశ్ వంటి దిగ్గజాలంతా ఒకే వేదికపై సందడి చేశారు. మరుసటి రోజు క్రికెట్ ప్రపంచం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పార్టీలో ఎంఎస్ ధోనీ, కేన్ విలియమ్సన్, ముత్తయ్య మురళీధరన్, అశ్విన్, అజిత్ తదితరులు హాజరై వేడుకకు మరింత గ్లామర్ తెచ్చారు.


ఇక తాజాగా తన సామ్రాజ్యానికి వెన్నెముక అయిన సన్ నెట్‌వర్క్ ఉద్యోగులందరికీ కళానిధి మారన్ గ్రాండ్ విందు ఏర్పాటు చేసి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అంతేకాదు, పెళ్లి శుభలేఖలు పంపిణీ చేసిన సమయంలోనే ఉద్యోగులకు బంగారు కానుకలు అందించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతిథి మర్యాదలు, విందు ఏర్పాట్లు, కానుకల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కళానిధి మారన్ ఈ వేడుకను నిర్వహించిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో జయలలిత తన కొడుకు పెళ్లిని చరిత్రలో నిలిచిపోయేలా చేస్తే.. ఇప్పుడు కళానిధి మారన్ తన కూతురు కావ్య పెళ్లిని అంతకుమించిన వైభవంతో జరిపించారంటూ తమిళ తంబీలు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.

Updated Date - Nov 25 , 2026 | 07:59 PM