సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కార్తీ డబుల్ మీనింగ్ డైలాగ్.. నెటిజన్స్ ఫైర్

ABN, Publish Date - Sep 04 , 2026 | 07:46 PM

కోలీవుడ్ వర్సటైల్ నటుడు కార్తీ కథానాయకుడిగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ యాంటిసిపేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2 (Sardar 2).

Sardar 2

కోలీవుడ్ వర్సటైల్ నటుడు కార్తీ కథానాయకుడిగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ యాంటిసిపేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2 (Sardar 2). ఎస్‌.జె. సూర్య, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్, యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సర్దార్ 2 ప్రీ రిలీజ్ వేడుకలో కార్తీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు, సినీ విమర్శకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


ఈ వేడుకలో కార్తీ మాట్లాడుతూ.. సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోందని తెలియగానే, హాలీవుడ్ ప్రముఖ నటి మోనికా బెల్లూచీ తరహాలో ఈ సినిమాలో కూడా ఆమె గ్లామరస్ దుస్తులు ధరిస్తుందా లేదా అని తాను టీమ్‌ను అడిగినట్లు సరదాగా చెప్పాడు. అయితే అలా అడిగింది తన వ్యక్తిగత ఆనందం కోసం కాదని, కేవలం థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల వినోదం కోసమే అని కార్తీ సరదాగా వ్యాఖ్యానించాడు. నటుడు కార్తీ ఈ వ్యాఖ్యలను హాస్యపూర్వకంగానే చేసినప్పటికీ, ఆయన ప్రవర్తన పరిధి దాటిందని భావించిన పలువురు నెటిజన్లు, ఫెమినిస్టులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.


ఒక నటి నటన, ప్రతిభను పక్కనపెట్టి, కేవలం ఆమె గ్లామర్, శరీర ఆకృతిని ఉద్దేశించి డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడటం మహిళలను వస్తువుగా చిత్రీకరించడమే అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కార్తీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదని, సహనటి గురించి అలా ఎలా మాట్లాడతారని మండిపడుతున్నారు. మరి దీనిపై కార్తీ ఏదైనా స్పందిస్తాడేమో చూడాలి. ఇక ఈ సినిమాలో మాళవిక ఒక స్పైగా కనిపిస్తోంది. సర్దార్ తో విజయాన్ని అందుకున్న కార్తీ సర్దార్ 2 తో ఎలా అలరిస్తాడో చూడాలి.

Updated Date - Sep 04 , 2026 | 07:46 PM