సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కార్తీ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే

ABN, Publish Date - Aug 03 , 2026 | 04:49 PM

కార్తీ - మోహన్ రాజా కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ నుంచే సినీ వర్గాల్లో విశేషమైన ఆసక్తి నెలకొంది.

Karthi

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఉన్న స్టార్ హీరో కార్తీ (Karthi) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన సర్దార్ 2 (Sardaar 2) సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా, దానితో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టి షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే కార్తీ తన తదుపరి బిగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.


ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. లక్ష్మణ్ కుమార్‌ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఎందుకంటే ఈ బ్యానర్ లో కార్తీకి ఇది నాలుగో సినిమా. దేవ్, సర్దార్, సర్దార్ 2 తర్వాత మరో సినిమాకు ఈ కాంబో శ్రీకారం చుట్టింది. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి స్టైలిష్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించడంలో దిట్ట అయిన మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తీ - మోహన్ రాజా కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ నుంచే సినీ వర్గాల్లో విశేషమైన ఆసక్తి నెలకొంది.


అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, దానికి పక్కా కమర్షియల్ హంగులను జోడించి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి కార్తీ ఈసారి ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.

Updated Date - Aug 03 , 2026 | 04:59 PM