రాజకీయాల్లోకి నయనతార.. త్రిషకు పోటీగా
ABN, Publish Date - Oct 13 , 2026 | 11:30 AM
అసలు కోలీవుడ్ లో ఏం జరుగుతోంది.. ప్రస్తుతం అందరి మైండ్ లో రన్ అయ్యే ప్రశ్న ఇదే. ఏ ముహూర్తన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి అయ్యారో.. అప్పటి నుంచి తమిళనాడులో ఎవరి నోట విన్నా పొలిటికల్ చర్చలే నడుస్తున్నాయి.
అసలు కోలీవుడ్ లో ఏం జరుగుతోంది.. ప్రస్తుతం అందరి మైండ్ లో రన్ అయ్యే ప్రశ్న ఇదే. ఏ ముహూర్తన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి అయ్యారో.. అప్పటి నుంచి తమిళనాడులో ఎవరి నోట విన్నా పొలిటికల్ చర్చలే నడుస్తున్నాయి. విజయ్ సీఎం అయ్యాక.. హీరో అయితే చాలా సీఎం అయ్యిపోవచ్చు అనే రేంజ్ లో మాటలు సాగుతున్నాయి. అంతేనా.. ధనుష్, శివ కార్తికేయన్ ఇలా వరుసగా వీరందరూ రాజకీయ బయట పడుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. హీరోలేనా.. మాకేమీ తక్కువ అంటూ హీరోయిన్లు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మొన్నటివరకు అందాల భామ త్రిష.. రాజకీయ రంగప్రవేశం గురించి అటు తమిళనాడు మాత్రమే కాకుండా మొత్తం ఇండస్ట్రీనే మాట్లాడుకుంది. జయలలితని అమ్మగా సంబోధించిన తమిళ తంబీలు త్రిషకు అక్కా అని పేరు పెట్టేశారు. నిజంగానే త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంది అనుకొనేలోపు ఆమెకు పోటీగా ఇప్పుడు మరో హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు కొత్త పుకారు మొదలయ్యింది. ఆమె ఎవరో లేడీ సూపర్ స్టార్ నయనతార. తమిళనాట తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నయనతార త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందంటూ టాక్ నడుస్తోంది. త్రిషకు పోటీగా నయన్ రంగంలోకి దిగుతుందని టాక్ రావడంతో కొందరు.. జయలలిత వారసురాలు నువ్వే అంటూ నయన్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇక నయన్ పొలిటికల్ ఎంట్రీ వార్తలపై తాజాగా నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ స్పందించాడు. ప్రస్తుతానికి నయనతారకు రాజకీయాల్లోకి వచ్చే ఎలాంటి ఆలోచన లేదని విఘ్నేశ్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం నయన్ తన మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోందని, పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు తన సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడివరకు బాగానే ఉన్నా.. విఘ్నేశ్, నయన్ పాలిటిక్స్ లోకి రావడం లేదు, ఇంట్రెస్ట్ లేదు అని మాత్రం చెప్పకపోవడంతో నయన్ భవిష్యత్ లో ఏమైనా రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశం ఉండొచ్చు అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ముందు ముందు తమిళనాడు రాజకీయాలు ఎలా మారనున్నాయో చూడాలి.