త్రిష రోడ్ షో.. పొలిటికల్ స్ట్రాటజీనా
ABN, Publish Date - Oct 24 , 2026 | 07:37 PM
ఏ భాషలో హీరోయిన్లు అయినా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు. ఒక రెండు సినిమాలు చేసి పేరు తెచ్చుకోగానే కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా మారడం, షాపింగ్ మాల్స్, మొబైల్ షాప్స్ ఓపెన్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు.
ఏ భాషలో హీరోయిన్లు అయినా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు. ఒక రెండు సినిమాలు చేసి పేరు తెచ్చుకోగానే కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా మారడం, షాపింగ్ మాల్స్, మొబైల్ షాప్స్ ఓపెన్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే అందాల భామ త్రిష మాత్రం మొబైల్ షాప్ ప్రారంభోత్సవాన్నే పెద్ద పొలిటికల్ రోడ్ షోగా మార్చేసింది. తాజాగా కోయంబత్తూరులో జరిగిన ఒక ప్రైవేట్ మొబైల్ షాప్ ప్రారంభోత్సవానికి త్రిష (Trisha) విచ్చేయడంతో అక్కడ భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తారను చూసేందుకు స్థానికులు, ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో పోటెత్తారు.
ఈ ఈవెంట్కు విచ్చేసిన త్రిష అభిమానులను పలకరిస్తూ ఒక్కసారిగా చేతితో వేవ్ చేయగానే, అక్కడి జనసందోహం ఆనందంతో కేకలు వేస్తూ గంతులేశారు. త్రిష క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించేలా సాగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు, ఫ్యాన్స్ హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా షాప్ ప్రారంభోత్సవం అయితే.. ఆ షాప్ వద్దనే కారు దిగుతుంది. కానీ, త్రిష మాత్రం పొలిటికల్ లీడర్ లా కోయంబత్తూరు రోడ్లన్నీ కారులో తిరుగుతూ వచ్చేసింది. కారు లోపలి నుంచి బయటకి వచ్చి అందరికీ అభివాదం చేస్తూ ఒక పొలిటికల్ లీడర్ లా కనిపించింది.
ఇక ఈ షాప్ ఓపెనింగ్ లో అందరూ త్రిష పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు అని అడగడం గమనర్హం. ఈ రోడ్ షో కూడా ఆమె పొలిటికల్ స్ట్రాటజీ అని, ముందు ముందు ఎన్నికల్లో నిలబడడానికి ఇప్పటినుంచే తన అభిమాన సంఘాలకు దగ్గరగా ఉండాలని, ప్రజలతో మాట్లాడడానికి ఇలాంటి రోడ్ షోలు ఉపయోగపడతాయని ఆమె ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్, స్ట్రాటజీలు చూసి ఇది కేవలం శాంపిల్ మాత్రమే.. ఒక్కసారి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే త్రిష సినిమా చూపిస్తుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్లానింగ్, స్ట్రాటజీ పక్కన పెడితే.. రెడ్ సారీలో త్రిష కళ్ళు తిప్పుకొన్నివ్వకుండా చేస్తోంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం త్రిష ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. విజయ్ సీఎం అయ్యాక త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, త్రిషని విజయ్ అంతగా పట్టించుకోలేదు. మరి భవిష్యత్ లో వీరిద్దరూ కలిసి తమిళనాడును ఏం చేయనున్నారో చూడాలి.