సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఫహద్ ఫాజిల్‌ ‘అసరీరి’.. జనవరి 1న థియేటర్లలోకి!

ABN, Publish Date - Nov 24 , 2026 | 01:45 PM

ఫహద్ ఫాజిల్ హీరోగా సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ థ్రిల్లర్ ‘అసరీరి’ జనవరి 1, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ఎస్.ఎస్. కార్తికేయ విడుదల చేస్తున్నారు.

Fahadh Faasil - Prem Kumar

ఫహద్‌ ఫాజిల్‌ హీరోగా 'డోంట్‌ ట్రబుల్ ద ట్రబుల్‌' మూవీని నిర్మించిన ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు కార్తికేయ ఇప్పుడు మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఫహద్ ఫాజిల్ నటించిన తమిళ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నాడు. తాజాగా ఆ సినిమా వివరాలను మేకర్స్ ప్రకటించారు.

ఫహాద్‌ హీరోగా వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌ బ్యానర్ తో కలిసి డాక్టర్‌ ఇషారి కె గణేశ్‌, సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో 'అసరీరి' అనే సినిమాను నిర్మించారు. గతంలో ప్రేమ్‌ కుమార్‌ '96', 'సత్యం సుందరం' చిత్రాలను తెరకెక్కించారు. అయితే వాటికి భిన్నంగా ఇప్పుడీయన థ్రిల్లర్ కథాంశాన్ని ఎంచుకున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. 2027 జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.


'అసరీరి' సినిమాలో శివద, చేతన్, గీత, హరీష్ ఉత్తమన్, కరుణాకరన్, శరణ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు సి. ప్రేమ్ కుమార్, సంగీత దర్శకుడు గోవింద్ వసంత కలిసి పనిచేస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘96’, ‘సత్యం సుందరం’ (మెయ్యళగన్) సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ‘అసరీరి’తో మరోసారి ఈ కాంబో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు మహేంద్రన్ జయరాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆర్. గోవిందరాజ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక యాక్షన్ సన్నివేశాలకు మహేష్ మాథ్యూ స్టంట్స్ కంపోజ్ చేస్తుండగా, కుమార్ గంగప్పన్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

'అసరీరి' సినిమా కేరళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను భావన సంస్థ సొంతం చేసుకోగా.. తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్. ఎస్. కార్తికేయ నేతృత్వంలోని షోయింగ్ బిజినెస్ సంస్థ విడుదల చేయనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈసారి సంక్రాంతి సీజన్‌లో గట్టి పోటీ నెలకొని ఉంది. అందుకే కొందరు స్టార్స్ డిసెంబర్‌ నెలాఖరులో తమ చిత్రాలను విడుదల చేస్తుంటే... సితార ఎంటర్ టైన్ మెంట్స్ 'వింటారా సరదాగా' చిత్రాన్ని జనవరి 1న రిలీజ్‌ చేస్తోంది. ఇప్పుడు ఆ సినిమాతో పాటే ఫహద్ ఫాజిల్‌ డబ్బింగ్‌ సినిమా 'అసరీరి' కూడా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

‘దేవర’కు గ్రహణం వీడింది.. బుల్లితెరకు వచ్చే సమయం ఆసన్నమైంది

ఈ ‘ఆలోచన’ నిజంగా ఒక మంచి ఆలోచన: చిరంజీవి

Sampath Nandi: ఇప్పటివరకు శర్వా బెస్ట్ చూశారు.. ఇక బీస్ట్ చూస్తారు

Updated Date - Nov 24 , 2026 | 01:55 PM